వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-10-19T05:25:40+05:30 IST

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి, రైతులకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
రైతుసంఘాల నాయకులను అడ్డగిస్తున్న పోలీసులు

  1. రైతు సంఘాల రైల్‌ రోకోను అడ్డుకున్న పోలీసులు


నంద్యాల టౌన్‌, అక్టోబరు 18: దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి, రైతులకు తీవ్ర నష్టం కలిగించే  వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా నంద్యాలలో రైల్‌ రోకో నిరసన తెలపడానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను రైల్వే స్టేషన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారు స్టేషన్‌ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో  రైతులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. రైతు సంఘాల నాయకులు రమే్‌షకుమార్‌, తోటమద్దులు, బాబాఫకృద్దీన్‌, మస్తాన్‌వలి, సద్దాం హుసేన్‌, లక్ష్మణ్‌ టికెట్‌ కౌంటర్‌వద్ద బైఠాయించారు. ఈసందర్భంగా నాయకులు మాటా ్లడుతూ వ్యవసాయ చట్టాలను,  కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌ల ను రద్దు చేయాలని కోరారు. విద్యుత్‌ డిస్కంల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు.  



Updated Date - 2021-10-19T05:25:40+05:30 IST