వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే

ABN , First Publish Date - 2021-01-27T05:34:13+05:30 IST

రైతుల కడుపు కొట్టి కార్పొరేట్‌ల కడుపు నింపే నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని లేకుంటే ట్రంప్‌ తరహాలో మోదీని సాగనంపాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర సమితి సభ్యుడు నారాయణ, టీడీపీ నాయకులు హరిప్రసాద్‌, అమీర్‌బాబు తెలిపారు.

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే
ట్రాక్టర్ల ర్యాలీలో సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు

ట్రంప్‌ తరహాలో మోదీని సాగనంపాలి

ట్రాక్టర్ల ర్యాలీలో సీపీఐ, సీపీఎం నాయకులు 


కడప (రవీంద్రనగర్‌), జనవరి 26 : రైతుల కడుపు కొట్టి కార్పొరేట్‌ల కడుపు నింపే నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని లేకుంటే ట్రంప్‌ తరహాలో మోదీని సాగనంపాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర సమితి సభ్యుడు నారాయణ, టీడీపీ నాయకులు హరిప్రసాద్‌, అమీర్‌బాబు తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా కడప నగరంలో మంగళవారం ట్రాక్టరు ర్యాలీని బిల్టప్‌ దగ్గర నుంచి ఐటీఐ సర్కిల్‌, కోటిరెడ్డిసర్కిల్‌, ఏడురోడ్లు, క్రిష్ణాసర్కిల్‌ మీదుగా దేవునికడప రోడ్డులోని మారె ్కట్‌యార్డు వరకు నిర ్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో వారు మాట్లాడుతూ రైతు వ్యతిరేక మూడు చట్టాలు తీసుకువచ్చి ఇటు రైతులను, అటు వినియోగదారులను ఏకకాలంగా దోపిడీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నారన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు తొత్తుగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, బాబుబాయ్‌, మస్తాన్‌వలి, సీపీఐ రైతు సంఘం నాయకులు రమణయ్య, శ్రీక్రిష్ణ, క్రిష్ణమూర్తి, రామయ్య, నాగసుబ్బారెడ్డి, సుబ్రమణ్యం, సుబ్బారెడ్డి, వెంకటశివ, బషీరున్నీసా, విజయలక్ష్మి, వీరశేఖర్‌, సుబ్బరాయుడు, మనోహర్‌, అన్వేష్‌, ప్రభాకర్‌రెడ్డి, సుబ్బమ్మ, సీఆర్వీ ప్రసాదరావు, వేణుగోపాల్‌, సావంత్‌ సుధాకర్‌, బాదుల్లా, మద్దిలేటి, భాగ్యలక్ష్మి, కొమ్మద్ది ఈశ్వరయ్య, సురేష్‌, మల్లి, చంద్ర, వెంకటేశ్‌, క్రిష్ణవేణి పాల్గొన్నారు.



Updated Date - 2021-01-27T05:34:13+05:30 IST