మెడికల్ కౌన్సిలింగ్ తర్వాత హార్టీకల్చర్ కౌన్సిలింగ్

ABN , First Publish Date - 2021-12-03T23:34:49+05:30 IST

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ(హానర్స్)అగ్రికల్చర్, బిఎస్సీ(హానర్స్)కమ్యూనిటీ సైన్స్, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం బివిఎస్సీ, ఏహెచ్, బిఎఫ్ఎస్సీ, తెలంగాణ హార్టీ కల్చరల్ విశ్వవిద్యాలయం , బీఎస్సీ(హానర్స్)హార్టీ కల్చర్ కోర్సులకు సంబంధించి

మెడికల్ కౌన్సిలింగ్ తర్వాత హార్టీకల్చర్ కౌన్సిలింగ్

హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ(హానర్స్)అగ్రికల్చర్, బిఎస్సీ(హానర్స్)కమ్యూనిటీ సైన్స్, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం బివిఎస్సీ, ఏహెచ్, బిఎఫ్ఎస్సీ, తెలంగాణ హార్టీ కల్చరల్ విశ్వవిద్యాలయం , బీఎస్సీ(హానర్స్)హార్టీ కల్చర్ కోర్సులకు సంబంధించి ప్రవేశాల సంయుక్త కౌన్సిలింగ్ మెడికల్ కౌన్సిలింగ్ తర్వాత నిర్వహించ బడతాయని యూనివర్శిటీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆరు, వెటర్నరీ విశ్వ విద్యాలయానికి మూడు, ఉద్యాన విశ్వవిద్యాలయానికి రెండు కళాశాలలు మాత్రమే ఉన్నాయి. 


మూడు విశ్వ విద్యాలయాలకు ఎటువంటి ప్రైవేటు, అనుబంధ కళాశాలలు లేవు. ఈ మూడు విశ్వ విద్యాలయాలలోని వివిధ సామాజిక వర్గాల బైపీసీ స్ర్రీం కోర్సులలోని అన్ని సీట్లు కౌన్సిలింగ్ ద్వరానే భర్తీ చేస్తారు. రెగ్యులర్ సీట్లు, సెల్ప్ ఫైనాన్స్ సీట్ల భర్తీ రిజర్వేషన్లకు లోబడి టీఎస్ ఎంసెట్ 2021 మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. 2021..2022 ప్రవేశాల గురించి వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వరా జరుగుతున్న అసత్య ప్రచారము, వదంతులను విశ్వసించరాదని అధికారులు దరఖాస్తు దారులకు, వారి పేరెంట్స్ కు విన్నవించారు. వివిధ కోర్సుల దరఖాస్తుల మెరిట్ జాబితా, సామాజిక వర్గాల వారీ సీట్ల కేటాయింపు వివరాలు కౌన్సెలింగ్ కు ముందుగానే వెబ్ సైట్ లో ఉంచుతామని, దరఖాస్తు దారుల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించిన తర్వాతనే తుది జాబితాను వెబ్ సైట్ లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-03T23:34:49+05:30 IST