రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు- నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-04-10T19:49:18+05:30 IST

తెలంగాణలో ఈ సంవత్సరంలో 50 లక్షల ఎకరాల్లోవ్యవసాయ ఉత్పత్తులు పండినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు- నిరంజన్‌రెడ్డి

వనపర్తి: తెలంగాణలో ఈ సంవత్సరంలో 50 లక్షల ఎకరాల్లోవ్యవసాయ ఉత్పత్తులు పండినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం చేసే ప్రతి రైతూ ఎల్‌ఐసీ చేయించుకున్నట్టుగానే తమ పంటలకు ఖచ్చితంగా బీమా చేయించుకోవాలని సూచించారు. శుక్రవారం జిల్లాలోని పాన్‌గల్‌ మండంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా బియ్యంపంపిణీ, సోడియం క్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 6లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు, లక్ష ఎకరాల్లో ఆకు, కూరగాయలు పండినంట్టు తెలిపారు. కరెంట్‌, సాగునీరు, పంటపెట్టుబడి ఇస్తూ ప్రభుత్వం రైతులకు తోడ్పాటును అందిస్తోందన్నారు. పంట సాగులోరైతులు ఎంతో ఇష్టంగా పాల్గొన్నారని తెలిపారు. దురదృష్ఠవశాత్తూ వడగండ్ల వానతో దాదాపు 25 వేల ఎకరాల్లో పంటనష్టం వచ్చిందన్నారు. దీంతో రైతుల నోటికాడి పంట నేలపాలైందన్నారు. పంటనష్టం పై సమగ్ర సమాచారం తెప్పించుకుని రైతులను ఎలా ఆదుకోవాలో కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. గతంలో చెరువులు, కుంటలు నిండినప్పుడే శిస్తుచేసేది, కానీ ఇప్పుడు సాగునీటి రాకతో ప్రతి ఏటా లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని, త్వరలోనే కోటి ఎకరాల సాగు స్వప్పం నిజం అవుతుందన్నారు. తెలంగాణలో భవిష్యత్‌లో నీటి కొరత అన్నది రాకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వరి వేసే రైతులు మార్చి వరకూ కోతకు వచ్చేలా ప్రణాళిక చేసుకోవాలని, ఏప్రిల్‌ వరకు ఆగితే వర్షాల బారిన పడే ప్రమాదం ఉందని ఆ వర్షాలను మనం ఆపలేమన్నారు. 

Updated Date - 2020-04-10T19:49:18+05:30 IST