ఆర్బీకే సిబ్బంది రైతులతో సమన్వయంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-06-28T05:10:40+05:30 IST

రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులతో సమన్వంగా వ్యవహరించాలని గుంటూరు అగ్రి జేడీ నున్నా వెంకటేశ్వర్లు సూచించారు.

ఆర్బీకే సిబ్బంది రైతులతో సమన్వయంగా ఉండాలి
ప్రసంగిస్తున్న జేడీ నున్నా వేదికపై డీడీ రామాంజనేయులు తదితరులు

అగ్రి జేడీ నున్నా వెంకటేశ్వర్లు

గుంటూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులతో సమన్వంగా వ్యవహరించాలని గుంటూరు అగ్రి జేడీ నున్నా వెంకటేశ్వర్లు సూచించారు. గుంటూరులో సోమవారం ఆర్బీకే సిబ్బందికి వివిధ అంశాలపై జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.  ఆర్బీకేలలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో  ఉంచాలని వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఏఈవోలు, ఏవోలు, ఇతర శాఖల సిబ్బంది రైతులకు అవసరమైన సలహాలను ఆర్బీకేల ద్వారా ఇవ్వాలని డీడీ రామాంజనేయులు సూచించారు. సమావేశంలో జిల్లావనరుల కేంద్రం ఏడీ వెంకటేశ్వర్లు,  ఏవోలు సుబ్రహ్మణ్యం(గుంటూరు), బి.సుధారాణి (పెదనందిపాడు), కె కిరణ్మయి(కాకుమాను), బి కిషోర్‌ (ప్రత్తిపాడు), కె లక్ష్మి (వట్టిచెరుకూరు) తదితరులు ప్రసంగించారు. పత్తిపాడు ఏడీ శ్రీనివాసరావు సమావేశానికి అధ్యక్షత వహించారు.


Updated Date - 2022-06-28T05:10:40+05:30 IST