పాలిసెట్‌-2020 ర్యాంకుల ఆధారంగానే వ్యవసాయ వర్శిటీలో ప్రవేశాలు

ABN , First Publish Date - 2020-05-29T22:29:03+05:30 IST

ప్రొఫెసర్‌ జయవశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లోమా కోర్సులలో 2020-21 విద్యాసంవత్సరానికి అడ్మిషన్‌లకోసం పాలిసెట్‌-2020 ప్రవేశాలను పరీక్ష ర్యాంకుల ఆధారంగానే జరుపుతామని రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. సుదీర్‌కుమార్‌ తెలిపారు

పాలిసెట్‌-2020 ర్యాంకుల ఆధారంగానే వ్యవసాయ వర్శిటీలో ప్రవేశాలు

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయవశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లోమా కోర్సులలో 2020-21 విద్యాసంవత్సరానికి అడ్మిషన్‌లకోసం పాలిసెట్‌-2020 ప్రవేశాలను పరీక్ష ర్యాంకుల ఆధారంగానే జరుపుతామని రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. సుదీర్‌కుమార్‌ తెలిపారు. అందుకే డిప్లోమా కోర్సులలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు పాలిసెట్‌ -2020 ప్రవేశ పరీక్షకు విధిగా హాజరు కావాలని ఆయన తెలిపారు.


వివిధ వ్యవసాయ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశం కొరకు పాలిసెట్‌-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడించిన తర్వాత విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా అడ్మిషన్‌ నోటఫికేషన్‌ విడుదల చేస్తుందన్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు విశ్వవిద్యాలయ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ప్రకారంగా వీడిగా దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయ డిప్లోమా కోర్సులలో ప్రవేశమునకు అభ్యర్థులు కనీసం 4సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.


పాలిసెట్‌-2020 ర్యాంకు లేకపోతే విశ్వవిద్యాలయం డిప్లోమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉండదని అన్నారు. సీట్ల కేటాయింపు విశ్వవిద్యాలయం నిర్వహించే కౌన్సిలింగ్‌ ప్రక్రియ నియమ నిబంధనల ప్రకారం, రిజర్వేషన్‌ నియమాలకు లోబడి నిర్వహిస్తామన్నారు. పాలిసెట్‌- 2020 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 9-6-2020 వరకు పొడిగించినట్టు తెలిపారు. 

Updated Date - 2020-05-29T22:29:03+05:30 IST