చల్లారని ఆగ్రహజ్వాల

ABN , First Publish Date - 2022-09-23T04:48:48+05:30 IST

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు మార్పుపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం చల్లారడం లేదు.

చల్లారని ఆగ్రహజ్వాల
నెల్లూరు : ఎన్టీఆర్‌పై ముద్రించిన కరపత్రాలను విడుదలచేస్తున్న టీడీపీ నాయకులు

రెండోరోజూ టీడీపీ శ్రేణుల ఆందోళన

హెల్త్‌ వర్సిటీకి ‘ఎన్టీఆర్‌’ పేరునే కొనసాగించాలని డిమాండ్‌


నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 22 : ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు మార్పుపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం చల్లారడం లేదు. గురువారం కూడా జిల్లావ్యాప్తంగా తెలుగుతమ్ముళ్లు ప్రదర్శనలు చేసి, ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పాలభిషేకాలు చేశారు. నెల్లూరులో నగరంలోని నర్తకి సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ అభిమానులమనే కొడాలి నాని, వల్లభనేని వంశీలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. జగన్మోహనరెడ్డికి ఊడిగం చేస్తున్న లక్ష్మీపార్వతి అన్నగారి ఇంటిపేరును కొనసాగించే అర్హత లేదన్నారు. అనంతరం హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలని కరపత్రాలు విడుదల చేశారు. ఈ నిరసనలో టీడీపీ నేతలు కంచి మల్లిఖార్జునరెడ్డి, వంటేరు శ్రీనివాసులు, ఉయ్యాల రవీంద్ర, ధర్మవరపు గణేష్‌కుమార్‌, బొద్దుకూరు లక్ష్మినారాయణ, తిరుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. కందుకూరులో పార్టీ నియోజకవర్గ ఇనచార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వర్సిటీ పేరు మార్పు జీవో ప్రతులను తగలబెట్టి నిరసన తెలిపారు. ఆత్మకూరు, ఉదయగిరి, ఉలవపాడు తదితర ప్రాంతాల్లోనూ టీడీపీ శ్రేణులో ఆందోళన చేశాయి.

Updated Date - 2022-09-23T04:48:48+05:30 IST