Viral Video: ఏటీఎమ్‌లో చోరీ చేస్తున్న దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-08-30T01:59:49+05:30 IST

ఇటీవలి కాలంలో దొంగలు ఏటీఎమ్‌లను కొల్లగొడుతున్న ఘటనలు తరచుగా వింటున్నాం..

Viral Video: ఏటీఎమ్‌లో చోరీ చేస్తున్న దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఏం చేశారంటే..

ఇటీవలి కాలంలో దొంగలు ఏటీఎమ్‌లను కొల్లగొడుతున్న ఘటనలు తరచుగా వింటున్నాం.. ఏటీఎమ్ (ATM theft)సెంటర్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా, సెక్యూరిటీ సిబ్బందిని పెడుతున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు.. అయితే ఆగ్రాలో పోలీసులు (Agra police) వెంటనే స్పందించడంతో ఓ దొంగ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. ఆ ఘటన మొత్తం ఏటీఎమ్ సెంటర్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral video) మారింది. 


ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి ఓ దొంగ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏటీఎమ్ సెంటర్‌లోకి ప్రవేశించాడు. ఏటీఎమ్ మెషిన్ నుంచి డబ్బులు తీసేందుకు ప్రయత్నం ప్రారంభించాడు. అయితే సీసీటీవీ ద్వారా ఆ దొంగ చర్యలను గమనించిన బ్యాంకు కంట్రోల్ రూం సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసుల సెకెన్ల వ్యవధిలో ఏటీఎమ్ సెంటర్‌కు చేరుకున్నారు. చోరీకి పాల్పడుతున్న యువకుడిని పట్టుకుని అక్కడే చితక్కొట్టారు. ఈ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

Updated Date - 2022-08-30T01:59:49+05:30 IST