Abn logo
Sep 19 2020 @ 07:26AM

21 నుంచి తాజ్‌మహల్ సందర్శనకు పర్యాటకులకు అనుమతి

Kaakateeya

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను  సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల రాక కోసం ఆగ్రా నగరంలోని హోటళ్లను శానిటైజ్ చేసి సిద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల గత ఐదునెలలుగా తాజ్ మహల్ ను మూసివేశారు. దీంతో ఆగ్రా నగరంలోని హోటళ్లు కూడా మూతపడటంతో యజమానులు తీవ్ర నష్టాల పాలయ్యారు. 

తాజ్ మహల్, ఆగ్రాకోటలను సందర్శకుల కోసం తెరవనున్నందున పర్యాటకులకు హోటల్ యజమానులు స్వాగతం చెప్పారు. ఈ నెల 21 నుంచి  తాజ్ మహల్‌లో సందర్శకులను అనుమతించేందుకు ఆగ్రా జిల్లా కలెక్టరు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగ్రా పర్యాటక రంగం ఊపందుకోనుంది. కలెక్టరు తీసుకున్న నిర్ణయంపై హోటల్ యజమానులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement