‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-07-02T05:41:57+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి
జడ్చర్లలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన యువజన కాంగ్రెస్‌ నాయకులు

- యువజన కాంగ్రెస్‌ దీక్షలో నాయకులు

బాదేపల్లి, జూలై 1 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్‌గడ్డ ప్రాంతంలో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసి, గతంలో మాదిరిగానే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మినాజ్‌, ఆనంద్‌, నక్కా రాఘవేందర్‌, సంధ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T05:41:57+05:30 IST