‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి

‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి
షాద్‌నగర్‌ అర్బన్‌: నిరసనలో జేఆర్‌ దినేష్‌సాగర్‌

షాద్‌నగర్‌అర్బన్‌/షాబాద్‌, జూలై 1: ఆర్మీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలిన ఎన్‌ఎ్‌సయూఐ జాతీయ కన్వీనర్‌ జేఆర్‌ దినే్‌షకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఎన్‌ఎ్‌సయూఐ పిలుపుమేరకు శుక్రవారం షాద్‌నగర్‌ పట్టణంలో కార్యకర్తలు నిరసనదీక్షను చేపట్టారు. ఈసందర్భంగా న్‌ఎ్‌సయుఐ జాతీయ కన్వీనర్‌ దినే్‌షసాగర్‌ మాట్లాడుతూ.. అగ్నిపథ్‌ను రద్దుచేసి, సికింద్రాబాద్‌ ఘటనలో నిరుద్యోగులపై నమోదుచేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సయుఐ నాయకులు కాట సుధీర్‌, మధుసూదన్‌రెడ్డి, మధు, ఉదయ్‌, ఇంద్రారెడ్డి, శ్రీకాంత్‌, సోహైల్‌, శ్రాంత్‌, భాను, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట   కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అగ్నిపథ్‌ను రద్దు చేయాలని సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు పెంటారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు వెంకటస్వామి, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి పామెర భీంభరత్‌, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు షాబాద్‌ దర్శన్‌, చేవెళ్ల నియోజకవర్గ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, గౌరీసతీష్‌, పామెన భార్గవరాంలు దీక్షలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST