ముందస్తు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాల నివారణ

ABN , First Publish Date - 2021-04-16T05:30:00+05:30 IST

ముందస్తు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాల నివారణ

ముందస్తు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాల నివారణ
ఉయ్యూరులో కరపత్రాలు పంపిణీ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఉయ్యూరు, ఏప్రిల్‌ 16 : ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా నివాస గృహాల్లో అగ్నిప్రమా దాలు జరుగకుండా నివారించ వచ్చని ఉయ్యూరు అగ్ని మాపక కేంద్ర అధికారి టి.శ్రీనివాసరావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకో వాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పే విధానాన్ని శుక్రవారం పలు ప్రాం తాల్లో  ప్రదర్శించారు.  అపార్ట్‌మెంట్లు, నివాస గృహాల్లో వంటగదుల్లో  అగ్ని ప్రమా దం జరిగి మంటలు లేచినప్పుడు భయపడి పారిపోకుండా మంటలు ఎలా  అదుపు చేయాలో వివరించారు. జాగ్రత్తలు పాటించటం ద్వారా ప్రమాదాలు జరుగకుండా చూడవచ్చన్నారు. 

గన్నవరంలో..

గన్నవరం  :  అగ్ని ఆర్పటం కంటే అగ్ని నిరోధక చర్యలే మేలని స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌  సుబ్రహ్మణ్వే శ్వరరావు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక సింధూర, ఎల్‌కె టవర్స్‌ అపార్ట్‌మెంట్‌లలో అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆందోళన చెందకుండా ముందుగా ఆయా పరిసరాల్లో నియంత్రణ ఏర్పాట్లకు అనుకూలంగా ఉన్నాయో లేదో చూడాలన్నారు. అక్కడ ఉన్న వాటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేయాలని సూచించారు. మంటలు ఆర్పటంపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. 

Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST