భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం

ABN , First Publish Date - 2022-04-21T15:02:29+05:30 IST

ఈరోడ్‌ జిల్లా సత్యమంగళంలో ప్రాచీనమైన, ప్రసిద్ధిచెందిన దండుమారియమ్మన్‌ ఆలయంలో అగ్నిగుండం, స్తంభం ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది

భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం

పెరంబూర్‌(చెన్నై): ఈరోడ్‌ జిల్లా సత్యమంగళంలో ప్రాచీనమైన, ప్రసిద్ధిచెందిన దండుమారియమ్మన్‌ ఆలయంలో అగ్నిగుండం, స్తంభం ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఉత్సవాలు ఈ నెల 6వ తేది ప్రారంభం కాగా, 7వ తేది స్తంభ స్థాపన జరిగింది. ప్రతిరోజు రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు యువకులు, పెద్దలు స్తంభం చుట్టూ నృత్యాలు చేస్తుంటారు. వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం అగ్నిగుండ మహోత్సవం నిర్వహించారు. తొలుత భక్తులు భవాని నది తీరానికి వెళ్లి పుణ్నస్నానాలు ఆచరించి అగ్నిగుండ ప్రవేశం చేశారు. కొందరు మహిళలు చంటిబిడ్డలను ఎత్తుకొని అగ్నిగుండ ప్రవేశం చేశారు.


Updated Date - 2022-04-21T15:02:29+05:30 IST