ఏజీఎల్‌ కనెక్షన్లు ఇస్తాం

ABN , First Publish Date - 2021-08-06T06:44:04+05:30 IST

రైతులకు అందిస్తున్న వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో జాప్యం

ఏజీఎల్‌ కనెక్షన్లు ఇస్తాం
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శివప్రసాద్‌ రెడ్డి 

విస్సన్నపేట, ఆగస్టు 5 : రైతులకు అందిస్తున్న వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో జాప్యం జరుగుతున్న మాట నిజమేనని త్వరలో సమస్యలను తొలగించి  వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు (ఏజీఎల్‌) మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ ఎం.శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. విస్సన్నపేట కార్యాలయంలో నూజివీడు డివిజన్‌ స్థాయి అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ డివిజన్‌లో 4,531 మంది రైతులు విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని వారందరికీ త్వరలో కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. నాగులూరు, నర్మదానగర్‌, జంగంగూడెం గ్రామాల్లో 133 కేవీఏ సబ్‌ స్టేషన్లను నిర్మిస్తామన్నారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను సంరక్షించుకునే బాధ్యత ఆయా ప్రాంత రైతులపై ఉందన్నారు. సకాలంలో వినియోగదార్లు విద్యుత్‌ బిల్లులను చెల్లించాలని సూచించారు. డీఈ కృష్ణ నాయక్‌, ఏడీలు, ఏఈలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-06T06:44:04+05:30 IST