పెట్రో ధర పెంపుపై నిరసన

ABN , First Publish Date - 2021-06-14T04:48:18+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరల పెంపుపై ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ నేతలు ఆదివారం నిరసన తెలిపారు. నగరంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.

పెట్రో ధర పెంపుపై నిరసన
నిరసన తెలుపుతున్న నేతలు

నెల్లూరు(వైద్యం) జూన్‌ 13 : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరల పెంపుపై ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ నేతలు ఆదివారం నిరసన తెలిపారు. నగరంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇబ్రహీం మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అసెంబ్లీలో జగన్‌ మాట్లాడుతూ తాను అధికాంలోకి వస్తే వెంటనే వాటిని తగ్గిస్తామన్న చేసిన ప్రకటనలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల జీవితాలతో చెలగాట మాడుతున్నాయన్నారు. ఎన్నికలప్పుడు మొసలి కన్నీరు.. గెలిచాక రక్త కన్నీరు అన్న ధోరణితో  వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు రహీమ్‌, జమీర్‌, సాదిక్‌, అస్లాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-14T04:48:18+05:30 IST