ఎరువుల ధర పెంపుపై నిరసన

ABN , First Publish Date - 2021-04-11T05:01:01+05:30 IST

పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కోరుతూ రెడ్డిగణపవరం సెంటరులో శనివారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

ఎరువుల ధర పెంపుపై నిరసన
రెడ్డిగణపవరం సెంటర్లో జీవో కాపీలను దహనం చేస్తున్న నాయకులు

బుట్టాయగూడెం, ఏప్రిల్‌ 10: పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కోరుతూ రెడ్డిగణపవరం సెంటరులో శనివారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గిరిజన రైతులు ఎరువుల ధర జీవో కాపీల ను దహనం చేశారు. కేవీపీఎస్‌ అప్‌ల్యాండ్‌ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచడం దు ర్మార్గమన్నారు. ఎరువుల ధరల పెంపు వలన ఉత్పత్తి ఖర్చులు పెరిగి రైతు లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్తా ఎరువుకు ఏకంగా రూ.700 పెంచడంలో కేంద్రానికి ఉన్న శ్రద్ధ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించ డంలో లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు పెరుగుతూనే ఉన్నా యి తప్ప తగ్గిన దాఖలాలు లేవన్నారు. సామాన్యులు బ్రతకలేని స్థితిలో ఉన్నారని మోదీ ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతు న్నాయన్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు విడనా డాలని, కార్పోరేట్లకు ప్రజల ధనాన్ని కట్టబెట్టే విధానాలను విడనాడకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. కోర్స జలపాలు, సీహెచ్‌ సత్యనారాయణ, పి.దుర్గారావు, వా మిశెట్టి వెంకటేశ్వరావు, శివుడు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T05:01:01+05:30 IST