నూతన జాతీయ విద్యా విధానం రద్దుకు ఉద్యమించండి

ABN , First Publish Date - 2022-08-20T05:15:50+05:30 IST

నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలంటూ ఈ నెల 23న అన్ని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టనున్న విద్యా సంస్థల బంద్‌ ను జయప్రదం చేయాలని విద్యార్థి సం ఘాల నేతలు పిలుపునిచ్చారు.

నూతన జాతీయ విద్యా విధానం రద్దుకు ఉద్యమించండి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విద్యార్థి సంఘాల రాష్ట్ర, జిల్లా నేతలు

రాయచోటిటౌన, ఆగస్టు 19: నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలంటూ ఈ నెల 23న అన్ని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టనున్న విద్యా సంస్థల బంద్‌ ను జయప్రదం చేయాలని విద్యార్థి సం ఘాల నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, ఏఐఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేషా, పీడీఎస్‌యూ జిల్లా కోశాధికారి జోగే శ్వర్‌, ఐఎఫ్‌ఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి శెట్టి పల్లె సాయి కుమార్‌, ఏపీఎస్‌ఎఫ్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఏ రాష్ట్రం లోనూ అమలు చేయకపోయినా, తనపైన ఉన్న కేసుల నుంచి కాపాడుకోవడం కోసం  ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ముఖ్య మంత్రి జగనమోహనరెడ్డి  విద్యార్థుల జీవితాలను ఫణంగా పెడుతున్నాడ న్నారు.  నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు 117, 85, 84 జీవోలను తీసుకొచ్చారన్నారు. ఇలాంటి నిర్ణయా లతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రైవేట్‌, కార్పొరేట్‌ వి ద్యాసంస్థల ఫీజుల దోపిడీ పెరుగుతోంద న్నారు. హాస్టళ్లలో వసతులు కల్పించకపోవడంతో విద్యా ర్థులందరూ దయనీయ స్థితిలో విద్యన భ్యసిస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  స్కాలర్‌షిప్‌ లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అమ్మఒడి, వసతి దీవెన, విద్యాదీవెన బకాయిలను తక్షణమే విడు దల చేయాలని, ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకు రావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశా లల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పో స్టులను భర్తీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల యాజమాన్యాలు, కరస్పాం డెంట్‌లు, ప్రిన్సిపాల్స్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారు ్థలు పూర్తిగా సహకరించి ఈ నెల 23న జరగ బోయే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్య లను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన లు  చేస్తామని వారు హెచ్చరించారు. 

రైల్వేకోడూరు: 3, 4, 5 తరగతులను హైస్కూలులో విలీనం చేసే పక్రియను ప్రభు త్వం వెంటనే ఆపాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు జాన్‌ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.  ఈ నెల 23న నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలని శుక్రవారం స్థానిక  ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేశారు. చందు, రిషికేష్‌, పవన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట: విద్యాసంస్థల బంద్‌కు సంబంధిం చిన వాల్‌పోస్టర్లను ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు నరసింహ, పీడీఎస్‌యూ నాయకులు నాగేశ్వర, రమణ, నారాయణ తదితరులు శుక్రవారం విడు దల చేశారు. సాయిమనోజ్‌, వేణుగోపాల్‌, గౌత మ్‌, లోకేష్‌, హేమంత  పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T05:15:50+05:30 IST