మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీ. ఈశ్వరయ్య
రాయచోటిటౌన్, జూలై 3: ప్రజా సమస్య లు పట్టించుకోని ప్రభు త్వ వైఖరికి నిరసనగా ఉద్య మించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీ. ఈశ్వరయ్య పిలుపుని చ్చారు. ఆదివారం రాయ చోటి ఎన్జీవో హోంలో మ హేష్ అధ్యక్షతన నిర్వ హించిన అన్నమయ్య జిల్లా సీపీఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసి తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఝరికోన ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు మాట్లాడుతూ పీలేరు పరిసరాల్లో భూ ఆక్రమణలపై కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. అర్జీలు పెట్టుకొన్న పేదలందరికీ ఇళ్లు నిర్మిం చి ఇవ్వాలని కోరారు. జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి అవసరమైన నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ీజిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, మనోహర్‌రెడ్డి, రాయచోటి, మదనపల్లె, కోడూరు నియోజకవర్గ కార్యదర్శులు సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సాంబశివ, రాధాకృష్ణ, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు విశ్వనాధ్‌నాయక్, రంగారెడ్డి, జతిన్, వెంకటేష్, సుధీర్, సుమిత్ర, లవకుమార్, నాయకులు జక్కల వెంకటేష్ పాల్గొన్నారు.