‘అఖండ’ చూడ్డానికి అఘోరాలు కూడా వచ్చారు !

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి దర్శకత్వంలో రూపొందిన  లేటెస్ట్ మూవీ ‘అఖండ’. మూడు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ‘క్రాక్’ మూవీ తర్వాత అంతటి స్థాయిలో మళ్ళీ మాస్ అపీల్ ఉన్న సినిమా కావడంతో బాలయ్య అభిమానులు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ సినిమాను చూడ్డానికి.. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఒక థియేటర్ కు అఘోరాలు కూడా వచ్చారు. శరీరానికి విబూది రాసుకొని, తాయెత్తులు కట్టుకొని అభిమానులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. శివనామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయారు. 

Advertisement