దూకుడు తగ్గని కొవిడ్‌

ABN , First Publish Date - 2022-01-26T05:30:00+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ దూకుడు కొనసాగుతోంది. పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యాక్టివ్‌ కేసులు కూడా 10,246కు చేరాయి. బుధవారం 2,215 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,295 మందికి పాజిటివ్‌ ఫలితం వచ్చింది. అందులో ఒంగోలులో అత్యధికంగా 301 ఉన్నాయి.

దూకుడు తగ్గని కొవిడ్‌

కొత్తగా 1,1295 పాజిటివ్‌లు 

వెయ్యి దాటిన యాక్టివ్‌ కేసులు 

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 26 : జిల్లాలో కొవిడ్‌ దూకుడు కొనసాగుతోంది. పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యాక్టివ్‌ కేసులు  కూడా 10,246కు చేరాయి. బుధవారం 2,215 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,295 మందికి పాజిటివ్‌ ఫలితం వచ్చింది. అందులో ఒంగోలులో అత్యధికంగా 301 ఉన్నాయి. పీహెచ్‌సీల వారీగా చూస్తే.. బొట్లగూడురులో 59,మద్దిపాడులో 38, గురువాజీపేటలో 57, నాగిరెడ్డిపల్లిలో 39, వేటపాలెంలో 46, సంతనూతలపాడులో 50, చీరాలలో 51, బండ్లమూడిలో 41, కరవదిలో 33, కొత్తపట్నంలో 20 వెలుగు చూశాయి. గుంటుపల్లిలో 20, కారంచేడులో 18, ఈపురుపాలెంలో 13, మాచవరంలో 66, సంతమాగులూరులో 22, చీరాలలో మరియంపేటలో 10, శింగరాయకొండలో 26, పందిళ్లపల్లిలో 25 కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ పలువురు వైరస్‌ బారినపడ్డారు. ఇదిలా ఉండగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు గతంలో మాదిరిగా పూర్తిస్థాయిలో  చేయడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని పెంచితే మరిన్ని కేసులు బయపడే అవకాశం ఉంది. 

 

Updated Date - 2022-01-26T05:30:00+05:30 IST