ఏజెన్సీలో వడగళ్ల వాన

ABN , First Publish Date - 2022-04-18T02:13:15+05:30 IST

పార్వతీపురం మన్యం జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గుమ్మలక్ష్మీపురం

ఏజెన్సీలో వడగళ్ల వాన

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో వడగళ్ల వాన కురవగా.. ప్రజలు ఇళ్లలోకి పరుగులు తీశారు. పార్వతీపురం-గుమ్మలక్ష్మీపురం రహదారి మధ్యలో ఉన్న టిక్కబాయి వద్ద భారీ చెట్టు నేలకొరిగింది. పోలీసులు గ్రామస్థుల సహకారంతో దాన్ని తొలగించారు. జీడి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Updated Date - 2022-04-18T02:13:15+05:30 IST