సోషల్‌ వెల్ఫేర్‌లో..ఏజెన్సీ మాయాజాలం

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

ఎస్సీ సోషల్‌ వెల్ఫే ర్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. డిపార్టుమెంటులో తాత్కాలికంగా విధులు నిర్వహించే

సోషల్‌ వెల్ఫేర్‌లో..ఏజెన్సీ మాయాజాలం

వాచ్‌మన్‌ పోస్టుకు రూ. లక్ష

వేతనాల్లో సగానికి పైగా కోత

బయట చెప్తే ఉద్యోగాలు పీకేస్తానంటూ హెచ్చరిక

చోద్యం చూస్తున్న జిల్లా సాంఘిక శాఖ అధికారులు


మంచిర్యాల టౌన్‌, ఆగస్టు 6: ఎస్సీ సోషల్‌ వెల్ఫే ర్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. డిపార్టుమెంటులో తాత్కాలికంగా విధులు నిర్వహించే కిందిస్థాయి ఉద్యో గుల సంక్షేమం చూడాల్సిన అధికారులు ఏజెన్సీ నిర్వా హకునికి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతో  ఏజెన్సీ నిర్వాహకుడు చిరుద్యోగులను అనేక ఇబ్బం దులు పెడుతున్నట్లు తెలుస్తోంది. తాను చెప్పినట్లు నడుచుకోవాలని, లేని పక్షంలో ఉద్యోగాలు పీకేస్తానం టూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు జరుగుతున్న అన్యాయంపై బహి రం గంగా చెప్పుకోలేక, సమస్యలు తీర్చేవారు లేక తాత్కాలిక ఉద్యోగులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.  


వాచ్‌మన్‌ పోస్టుకు రూ. లక్ష....

దళిత అభివృద్ధి శాఖలోని వివిధ వసతి గృహాల్లో పని చేయడానికి ప్రభుత్వం వాచ్‌మన్‌లను నియమిం చింది. ఉద్యోగుల నియామకం, విధుల నిర్వహణ, జీతభత్యాల చెల్లింపు బాధ్యతలను జిల్లాలోని ఓ ఏజెన్సీకి అప్పగించింది. ఉద్యోగులకు నెలసరి వేతనాల కింద రూ. 12వేలు చెల్లించాలని జీఓ జారీ చేసింది. అయితే సదరు ఏజెన్సీ నిర్వాహకుడు చేతివాటం ప్రద ర్శించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లు 25 ఉండగా వాచ్‌ మన్‌లను నియమించేందుకు ఏజెన్సీ నిర్వాహకుడు తలా లక్షరూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం సంబంధిత అధికారుల దృష్టికి వెళ్లినా చూసీ చూడనట్లు వ్యహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నియామకాల సందర్భంగా వసూలు చేసిన మొత్తంలో కొంత వాటా అధికారుల కు ఉందని తెలుస్తోంది. ఇటీ వల ఓ ఉద్యోగిని డబ్బు లు ఇవ్వలేదనే నెపంతో విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కడంతో తిరిగి అతన్ని విధుల్లోకి తీసు కోవాలని దళిత అభివృద్ధిశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి ఏజెన్సీ నిర్వాహకున్ని ఆదేశించినట్లు సమాచారం.


వంట మనిషి నియామకాల్లోనూ 

పోస్ట్‌మెట్రిక్‌ (కళాశాల విద్యార్థుల) హాస్టల్‌లో హెడ్‌కుక్‌ నియామకాల్లోనూ సదరు ఏజెన్సీ నిర్వాహ కుడు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలోని 8 హాస్టళ్లలో ఎనిమిది మంది హెడ్‌ కుక్‌ల ను నియమించాల్సి ఉంది. వీరు తమ పరిధిలో సహా యకులుగా ఇద్దరు లేక ముగ్గురిని నియమించుకొనే అధికారం ఉంటుంది. కానీ ఏజెన్సీ నిర్వాహకుడే అద నంగా నలుగురు సహాయకులను నియమిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హాస్టళ్లలో హెడ్‌ కుక్‌కు 100 మంది వరకు విద్యార్థులు ఉంటే వేతనం రూ.20 వేలు ఇవ్వాలి. 150 మంది ఉంటే రూ.25 వేలు, 200 మంది ఉంటే రూ. 30వేల చొప్పున వేతనాలు ఇవ్వాలని ఎస్సీ వెల్ఫేర్‌ డీడీ  రవీందర్‌రెడ్డి తెలిపారు. కానీ ఆయా హాస్టళ్లలో పని చేసే ప్రఽధాన వంట మనిషులకు కూడా రూ. 5వేలు వేతనం ఇస్తున్నట్లు సమాచారం. ఇలా దొరినంత మేర ఉద్యోగుల వేతనాల్లో నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.   


వేతనాల్లో కోత...

వేతనాల్లో కూడా ఇష్టానుసారంగా కోత విఽధిస్తు న్నట్లు ఆరోపణలున్నాయి. ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో పని చేసే వాచ్‌మన్‌కు రూ. 12వేలు ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టంగా పేర్కొంది. అయితే ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో పని చేస్తున్న తమకు నాలుగు సంవత్సరాలుగా నెలకు రూ. 5వేలు మాత్రమే చెల్లిస్తు న్నట్లు ఉద్యోగులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ సోషల్‌ వెల్ఫేర్‌ శాఖలో 17 ప్రీమెట్రిక్‌, 8 పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో ఔట్‌ సోర్సిం గ్‌ విధానం, పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాల్లో క్యాటరింగ్‌ విధానంలో ఉద్యోగులను నియమించాల్సి ఉంది. అయి తే ఉద్యోగాల్లో నియామకం సమయంలో తమను ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో తీసుకున్నట్లు తెలిపిన ఏజెన్సీ నిర్వాహకులు ప్రస్తుతం క్యాటరింగ్‌ విభాగంలో చేర్చుకొని వేతనాల్లో కోత విధిస్తున్నారని వారు వాపోతున్నారు. 


అక్రమ వసూళ్లపై చర్య తీసుకోవాలి..తోట రాజేష్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో ఏజెన్సీ నిర్వాహకుడు చేస్తున్న అక్రమ వసూళ్ల పర్వంపై ఆ శాఖ అధికా రులు చర్యలు తీసుకోవాలి. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లలేదనడం సరికాదు. 2019-20 సంవత్సరా నికి సంబంధించి బహిరంగ నోటిఫికేషన్లు జారీ అయినా జిల్లా అధికారి తన అనునాయునికే ఏజెన్సీ ఇప్పించుకోవడం జరిగింది. ఈ విషయమై సంబంధిత అధికారిని సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే సంవత్సరం కావస్తున్నా ఇంత వరకు ఇవ్వ లేదు. ఉద్యోగులకు పూర్తి వేతనం అందిచడంతోపాటు అక్రమాలకు పాల్పడ్డ ఏజెన్సీ నిర్వాహకుడు, సం బంధిత అధికారులపై కలెక్టర్‌ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.  


వేతనాల్లో కోత నా దృష్టికి రాలేదు...ఎస్సీ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి

వాచ్‌మన్‌లకు వేతనాల్లో కోత విధిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు.నిధులు విడుదల కాగానే ఏజెన్సీ అకౌంట్‌కు పూర్తిస్థాయి వేతనాలు ట్రాన్స్‌ఫర్‌ చేయడం జరుగుతోంది. ఉద్యోగులు కూడా ఎప్పుడూ ఈ విష యమై ఫిర్యాదు చేయలేదు. 2019 మార్చిలో బాధ్య తలు స్వీకరించినప్పటి నుంచి రిక్రూట్‌మెంట్‌ జరుగ లేదు. పోస్టుకు లక్ష వసూలు చేసిన విషయం నాకు తెలియదు.  

Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST