ఎన్నెన్నో అందాలు..!

ABN , First Publish Date - 2020-12-05T05:21:36+05:30 IST

పశ్చిమ ఏజెన్సీ ప్రకృతి అందాలకు నిలయం.

ఎన్నెన్నో అందాలు..!
ధార జలపాతం

మన్యంలో జలపాతాల సోయగాలు

పర్యాటకులను కట్టిపడేస్తున్న అందాలు

సుదూర ప్రాంతాల నుంచి రాక

 

బుట్టాయగూడెం, డిసెంబరు 4 :

పశ్చిమ ఏజెన్సీ ప్రకృతి అందాలకు నిలయం. 365 రోజులు పచ్చదనంతో కనువిందు చేస్తుంటుంది. కొండవాగులు, సెలయేళ్ళు, ఆకాశాన్ని తాకినట్లు కనిపించే పెద్ద పెద్ద చెట్లు, రకరకాల పూలతో మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఏజెన్సీకి వచ్చిన వారిని తన అందాలతో మన్యం ప్రాంతం కట్టిపడేస్తుంది.  ఒక్కసారి  పర్యటిస్తే మళ్లీ మళ్లీ వెళ్లి చూడాలనిపించే అందాలు ఏజెన్సీ సొంతం. చాలా మందికి ఇక్కడ జలపాతాలు ఉన్నాయన్న విషయమే తెలియదు. దీనిపై ఆంధ్రజ్యోతి స్పెషల్‌ స్టోరీ..

కొండల నుంచి జాలువారే జలపాతాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇటీవలే ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఏజెన్సీలో ముందుగా వెలుగులోకి వచ్చింది గుబ్బల మంగమ్మతల్లి ఆలయం వద్ద ఉండే జలపాతం. తర్వాత చిలకలూరు జలపాతం వెలుగులోకి రాగా ముంజులూరు సమీపంలోని అటవీ ప్రాంతంలోని జలపాతం పదేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాదే కొత్తగా మరో జలపాతం ముంజు లూరు పంచాయతీలోని ఉప్పరిల్ల కొండరెడ్డికి సుమారు ఏడు కిలోమీటర్లు దూరంలో వున్న ధార జలపాతం వెలు గులోకి వచ్చింది. ఉప్పరిల్ల అటవీ ప్రాంతంలో పెద్దలంక వెళ్లే దారిలో కొండలపై నుంచి ధారలుగా నీరు వస్తుండటంతో అడవి బిడ్డలు ధార జలపాతమని పిలు స్తుంటారు. ఇది ఉప్పరిల్లకు ఏడు కిలోమీటర్లు, పీఆర్‌గూడెంకు 10, కన్నాపురానికి 12, బుట్టాయ గూడెంకు 23, కొయ్యలగూడెంకు 20, జంగారెడ్డి గూడెంకు 35 కిలోమీటర్లు దూరంలో ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో అక్కడకు వెళ్లడానికి కొంచెం కష్టపడాలి. ఉప్పరిల్ల నుంచి మూడు కిలో మీటర్లు వరకు మాత్రమే వాహనాలు వెళతాయి. అక్కడ నుంచి కాలినడక తప్పదు. లేకుంటే మరో రెండు కిలోమీటర్లు వరకు ట్రాక్టరు మాత్రమే వెళుతుంది. మిగిలిన రెండున్నర కిలో మీటర్లు కాలినడకన వెళ్లాలి. ఇతర జలపాతాలతో పోలిస్తే ఽధార జలపాతం ఏడాది పొడవునా కొండలపై నుంచి నీరు వస్తుందని కొండరెడ్లు చెబుతున్నారు. ఇబ్బంది అనుకోకుం డా వెళ్లగలిగితే మంచి అనుభూతిని పర్యాటకులు సొంతం చేసు కోవడం తధ్యం. కొత్తగా ధార జలపాతం ఉందని తెలియడంతో పలువురు పర్యాటకులు ఇబ్బందులైనా అక్కడకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. కొత్త అనుభూతు లను సొంతం చేసుకుంటున్నారు. ముంజులూరు సమీపంలోని ఉర్రింక దారిలో ఏనుగుకుర్లబాట వద్ద మరో జలపాతం ఉంది. ఈ జలపాతాన్ని ఏనుగుకుర్ల బాట జలపాతం అని కూడా స్థానికులు పిలుస్తుంటారు. ఈ జలపాతం కన్నాపురానికి 16, బుట్టాయగూడెంకు 27, కొయ్యలగూడెంకు 23, జంగారెడ్డిగూడెంకు 40 కిలోమీటర్లు దూరంలో ఉంది. పదేళ్లుగా పర్యాటకులు ఇక్కడకు వెళుతు న్నారు. ఇక్కడకు వెళ్లాలంటే అంతగా ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ప్రవహించే అన్ని జలపాతాలు పాపికొండల్లో పుట్టి ఇక్కడ వరకు రావడం గమనార్హం. అనేక కొండలు, గుట్టలు దాటి నీరు వస్తుంటుంది.

అటవీశాఖ ఆంక్షలు

జలపాతాలను చూడాలని వస్తున్న వారు పర్యావరణం దెబ్బ తినే విధంగా వ్యవహరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. కొండలపైకి వెళ్లి జారడంలాంటి పనులు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ అనుమతితోనే పర్యాటకులు జలపాతాల వద్దకు వెళ్లాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


 వెళ్లిన కష్టాన్ని మర్చిపోయాం

ధార జలపాతానికి ఇటీవల బంధువులతో వెళ్లాను. అక్కడకు వెళ్లేందుకు చాలా కష్టాలు పడ్డాం. కొంత వరకు కారులో, మరికొంత దూరం ట్రాక్టరుపైన, రెండున్నర కిలోమీటర్లు కాలి నడక న పిల్లలతో వెళ్లాం. జలపాతాన్ని చూడగానే అన్నికష్టాలు మర్చిపోయాం. జీవితంలో మొదటిసారి జలపాతాన్ని చూడ టంతో మధురానుభూతి పొందా. ఏడాది పొడవునా నీరు వస్తున్నందున పర్యాటకులు ఎంజాయ్‌ చేస్తారు. రోడ్డుమార్గం లేకపోవడంతో ఏజెన్సీ అందాలను మనం మిస్‌ అవుతున్నాం.                    

– వై.యశోద, పీఆర్‌ గూడెం

 

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి 

ఏజెన్సీలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చ ని ప్రకృతి, అందమైన ప్రదేశాలు పర్యాటకులను కట్టి పడే స్తాయి. రహదారి సరిగా లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. జలపాతాలు రిజర్వు ఫారెస్టుల్లో ఉండ టం తో రహదారులు వేయడం ఇబ్బందిగా ఉం దంటున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెంది తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభు త్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఒక్క సారి ఇక్కడకు వస్తే మర్చిపోలేరు. 

– బి.చైతన్య, నర్సాపురం



Updated Date - 2020-12-05T05:21:36+05:30 IST