Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

యుగ పురుషుడు ఎన్టీఆర్‌

twitter-iconwatsapp-iconfb-icon

అంబరాన్నంటిన శత జయంతి వేడుకలు

ఊరూరా తెలుగు తమ్ముళ్ల ఘన నివాళి 


హిందూపురం టౌన, మే 28: యుగ పురుషుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు శనివా రం జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఊరూరా తెలుగు తమ్ముళ్లు మహనీయుడికి ఘన నివాళులర్పించారు. కేక్‌లు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. హిందూపురంలో తెలు గుదేశం పార్టీ శ్రేణులు, కళాకారులు కదంతొక్కారు. పట్టణంలోని నాలుగు సింహాల ఎన్టీఆర్‌ విగ్రహానికి ప్రత్యేక అ లంకరణలు చేశారు. బెంగ ళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్కాలతో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ముస్తాబు చేశారు.  పూలమాలలువేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి సంబ రాలు చేశారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ హిందూపురం నందమూరి పురంగా మారిందని కొ నియాడారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో తోడ్పాటునిచ్చాయన్నారు.  తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టినప్పుడు ఆవిర్భవించిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. ఓవైపు సినీరంగంలో, మరోవైపు రాజకీయంగా ఎన్టీఆర్‌ రాణించారన్నారు. వేడుకల్లో టీడీపీ పట్టణాధ్యక్షుడు రమేష్‌, నాయకు లు ఆర్‌ఎంఎస్‌ షఫీ, మాజీ మున్సిపల్‌ చైర్మన అనిల్‌కుమార్‌, మీడియో కోఆర్డినేటర్‌ చంద్రమోహన, పల్లాకుమా ర్‌, కోరుముట్ల నాగేంద్ర, రాఘవేంద్ర, నవీన, నజీర్‌, ఆదినారాయణ, దాదు, జయసింహ, కౌన్సిలర్‌ మంజుళ, మహాల క్ష్మీ, శ్రీదేవి, చెన్నమ్మ, హిదాయత, సూగూరు హనుమంతు, టైలర్‌ గంగాధర్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన లక్ష్మీ, శ్యామ ల, పరిమళ, సీతామాలక్ష్మీ, లక్ష్మీదేవి, సునీత పాల్గొన్నారు. హిందూపురం రూరల్‌ మండలంలో కన్వీనర్‌ అశ్వర్థనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మిట్టమీదపల్లి, తూముకుంట చెక్‌పోస్టులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉ పాధ్యక్షుడు అరుణాచల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఆదినారాయ ణ, వీవర్స్‌కాలనీ ఆంజనేయులు, హెచఎన రాము, నారాయణరెడ్డి, హనుమంతరాయుడు, రామకృష్ణారెడ్డి, రషీద్‌, ప్రదీప్‌, నాగరాజు, గోపాల్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, రామక్రిష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు. 


పెనుకొండ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి ఖ్యాతిని దశదిశలా చాటిన మ హోన్నత వ్యక్తి, నటసార్వభౌముడు, పద్మశ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను పట్టణంలో టీ డీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నాయకుడు మాధవనాయుడు, మాజీ జడ్పీటీసీ నాగలూరు నారాయణస్వామి, వీజీపాళ్యం కేశవయ్య, జఫ్రుల్లాఖాన, గు ట్టూరు సూరీ, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, బాబుల్‌రెడ్డి, హుజురుల్లాఖాన, జావిద్‌, అత్తర్‌ఖాదిర్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలువేసి, కొబ్బరికాయలు కొట్టి నివాళుల ర్పించారు. కేక్‌ కట్‌ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం ఊరువాకిలి ఆంజనేయస్వామి ఆలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా వంద కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో నా యకులు గోవిందు, నరసింహ, ఆవుల నరేంద్ర, దోణి లక్ష్మీనారాయణ, నరసింహులు, షౌకత, రియాజ్‌, వాజీద్‌, రమణమ్మ, గాయత్రి, సుబ్రహ్మణ్యం, కన్నాస్వామి, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. 


రొద్దం: ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని స్థా నిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌చేశారు. మహనీయుడికి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య,  నియోజకవర్గ టీఎనఎ్‌సఎ్‌ఫ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, అశ్వర్థనారాయణ, మురళి, చంద్రశేఖర్‌ నాయుడు, దొడగట్ట రామచంద్ర, కందుకూర్లపల్లి ఉప్పర అంజి, రొద్దకంపల్లి నారాయ ణ, ఉగ్గిరప్ప పాల్గొన్నారు. 


సోమందేపల్లి: స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌లో పార్టీ నాయ కులు, కార్యకర్తలు నందమూరి చిత్రపటానికి ఘనంగా ని వాళులర్పించి కేక్‌ కట్‌చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. దేశం గ ర్వించదగ్గ మహోన్నత వ్యక్తి ఎన్టీరామారావు అని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెంకటరాములు, నాయకులు రామాంజనేయులు, కిష్టప్ప, అశ్వర్థనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు. 


గోరంట్ల: ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలను గో రంట్లలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యదర్శి కొ త్తపల్లి నరసింహులు ఆధ్వర్యంలో నాయకులు బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరభిషేకం చేశారు. పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉత్తంరె డ్డి, అజ్మతుల్లా, గిరిధర్‌గౌడ్‌, జయరాం, వెంకటరంగారెడ్డి, ఉమాశంకర్‌, ఫిరోజ్‌బాషా, వెంకటరెడ్డి, రవినాయక్‌, శీనప్ప ల్లి రవి, రంగనాయకులు, రెడ్డప్ప, మేరెడ్డిపల్లి నరసింహు లు, హేమసుందర్‌రెడ్డి, ఎస్వీ నారాయణ, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


లేపాక్షి: నందమూరి తారకరామారావు శతజయంతి వే డుకలను శనివారం లేపాక్షిలో మాజీ ఎంపీపీ ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో మండల టీడీ పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


పరిగి: నటరత్న  నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను స్థానిక పంచాయతీ సచివాలయం ఆవరణంలో ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ నా యకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. 


చిలమత్తూరు: నందమూరి తారకరామారావు జయం తి వేడుకలను మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్త లు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకొని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అ న్నదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు బేకరీ గంగాధర, అశ్వర్థప్ప, నందీషప్ప, ఆంజనేయులు, గాజుల కిష్టప్ప, మీసేవ సూర్యనారాయణ, సజ్జప్ప, గంగాధర, రామప్ప, నా రాయణప్ప, విశ్వనాథరెడ్డి, మల్లికార్జున, బ్రహ్మానందరెడ్డి త దితరలు పాల్గొన్నారు. 


మడకశిర రూరల్‌: ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను నాయకులు, కార్యకర్తలు, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు, అభిమానులు గ్రామగ్రామానా ఘనంగా జరుపుకున్నారు. జ మ్మానిపల్లిలో హిందూపురం పార్లమెంట్‌ టీఎనఎ్‌సఎ్‌ఫ ఉ పాధ్యక్షుడు మురళిబాబు ఆధ్వర్యంలో  ఎన్టీఆర్‌  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్‌ చేసిన సేవలు  కొనియాడారు.  కా ర్యక్రమంలో నాయకులు ముత్యాలప్ప, శ్రీనివాసులు, శ్రీరామప్ప, హనుమంతరాయప్ప, శివప్ప, నరేష్‌ పాల్గొన్నారు.


గుడిబండ: నందమూరి తారకరామరావు పేదల అభ్యున్నతి కోసం ఎనలేని కృషిచేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని టీడీపీ మండల కన్వీనర్‌ మద్దనకుంటప్ప కొనియాడారు. స్థానిక ఎన్టీ రామారావు విగ్రహాని కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో విజయానికి ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్‌ కట్‌చేసి నాయకు లు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. నాయకులు శివకుమర్‌, గంగాధర్‌, రాజేంద్ర పాల్గొన్నారు. 


పావగడ: నందమూరి తారకరామారావు జయంతి వే డుకలను ఆయన అభిమానులు పావగడ పట్టణంలో ఘ నంగా జరుపుకున్నారు. శనీశ్వరాలయం ఎదుట ఎన్టీఆర్‌ చి త్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం కేక్‌కట్‌ చేసి అభిమానులు, ప్రజలకు పంచిపెట్టారు. తెలుగుజాతి కీర్తిపతాకాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన ఘనత ఒక ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కిందని మాజీ మున్సిపల్‌ అధ్యక్షుడు మానం వెంకటస్వామి అన్నారు. ఆ యన అడుగుజాడల్లో నడిచినప్పుడే ఎన్టీఆర్‌ ఆశయసాధనకు పాటుపడినట్లు అవుతుందని డాక్టర్‌ శ్రీకాంత తెలిపా రు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ అభిమానులు దేవరాజ్‌, వీరభద్రప్ప, మానం శశికిరణ్‌, నరసింహమూర్తి, గంగాధర్‌నాయుడు, లోకేష్‌ పాల్గొన్నారు. 


మడకశిర టౌన: నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు కృషి చేద్దామని టీడీపీ బీసీసెల్‌ జిల్లా ప్ర ధాన కార్యదర్శి గుండుమల రాధాకృష్ణ, జిల్లా ఆధికార ప్రతినిధి ఎస్‌ నాగరాజు అన్నారు. పట్టణంలోని ఎనటీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదే శం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని మహాశక్తిగా ఎదిగిందన్నారు.   అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు. కేక్‌ కట్‌ చేసి జ యంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షు డు భక్తర్‌, మాజీ  చైర్మనలు సుబ్బరాయుడు, రాజ, జిల్లా కార్యదర్శి ఓబులేసు, మాజీ సర్పంచ మాధవరాజు, నాయకులు పుల్లయ్య చౌదరి పాల్గొన్నారు. 


ఆగళి: మండలకేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి నం దమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను ఘ నంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమేష్‌ మాట్లాడుతూ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన మహానీయుడు అన్నారు. పేదలకు రూ.2లకే అన్నం పెట్టిన అన్నదాత అని కొనియాడారు. కార్యక్రమంలో మం డల జనరల్‌ సెక్రటరీ జయప్ప, ఎంపీటీసీ చంద్రప్ప, మాజీ సర్పంచ రవికుమార్‌, కమ్మరి సువర్ణ, నారాయణప్ప, రం గప్ప, మల్లేష్‌, రాజగోపాల్‌, జగదీస్‌, మాజీ మండలకన్వీన ర్‌ షౌకత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


మహానాడులో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు 

పెనుకొండ,మే 28: ఒంగోలు మహానాడులో హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను నిర్వహించారు. నాయకులు మునిమడుగు వెంకటరాముడు, కురుబ కృష్ణమూర్తి, కన్వీనర్‌ శ్రీరాములు, వడ్డెర్ల సంఘం అధ్యక్షులు వెంకట్‌ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. మహానాడుకు వె ళ్లిన పట్టణానికి చెందిన కురుబ కృష్ణమూర్తి, త్రివేంద్రనాయుడు, క న్వీనర్‌ శ్రీరాములు తదితరులు చంద్రబాబు నాయుడును కలిశా రు. పుష్పగుచ్ఛాన్ని అందించి, శాలువాకప్పి సన్మానించారు. 


మడకశిర టౌన: ఒంగోలు మహానాడుకు మడకశిర నియోజకవర్గం నుంచి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న వేర్వేరుగా హాజరయ్యారు. నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో కలసి ఎనటీఆర్‌ చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.