ఆరు నెలలుగా అందని వేతనాలు

ABN , First Publish Date - 2021-07-19T02:59:41+05:30 IST

నూతనంగా నియమి తులైన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు.

ఆరు నెలలుగా అందని వేతనాలు
ఉదయగిరి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం

కొత్తగా చేరిన అంగన్‌వాడీల అవస్థలు

ఆయాలది అదే పరిస్థితి

ఉదయగిరి రూరల్‌, జూలై 18: నూతనంగా నియమి తులైన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. విధుల్లో చేరి ఆరు నెలలు కావస్తున్నా ఒక్క నెల వేతనం కూడా అందని దయనీయ పరిస్థితి. అధికారులు చొరవ చూపకపోవడంతో సుమారు 60 మంది అంగన్‌వాడీలు ఆరు నెలలుగా జీతాల కోసం నిరీక్షిస్తున్నారు. 

ఆరు నెలలుగా ఎదురుచూపులు

 జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీ గతేడాది నవంబరు, డిసెంబరు మాసాల్లో జరిగింది. వారంతా డిసెంబరు, జనవరి నెలల్లో విధులు చేరారు. అప్పట్లో నియమితులైన వారికి కొందరికి వేతనాలు వస్తుండగా, మరికొందరికి వేతనాలు రావడంలేదు. అలాంటి వారు జిల్లాలో సుమారు 60 మంది ఉన్నారు. వీరు ఆరు నెలలు నుంచి వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.  

రెండు, మూడు ఖాతాల వల్లే..

నూతనంగా విధుల్లో చేరిన వారికి రెండు, మూడు బ్యాం కు ఖాతాల వల్లే సమస్య ఉత్పన్నమవుతుందని అధికారులు అంటున్నారు. విధుల్లో చేరిన వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందవు. ఉద్యోగాలకు ముందు చాలా మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందారు. ఈ క్రమంలో వారి బ్యాంకు ఖాతా నెంబర్‌, ఆధార్‌సంఖ్య సంక్షేమ పథకాలకు అనుసంధానమైంది. ఇవన్నీ సీఎ్‌ఫఎంఎ్‌సతో అనుసంధానం అయినట్లే. అనంతరం వేతనాల కోసం బిల్లు పెట్టగా పాత బ్యాంకు ఖాతా, ఆధార్‌సంఖ్యతో సీఎ్‌ఫఎంఎ్‌సతో అనుసంధా నం కావడంలేదు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత సీడీపీవోలు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కార్యకర్తలు, ఆయాలు ఆరు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉదయగిరి ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో 20 మంది అప్పట్లో నూతనంగా విధుల్లో చేరారు. నాటి నుంచి వేతనాల బిల్లులు పెడుతున్నా వేతనాలు పడకపోవడంతో వారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 


త్వరలో అందజేస్తాం..

 నూతనంగా విధుల్లో చేరిన వారికి త్వరలో వేతనాలు అందజేస్తాం. బడ్జెట్‌ సైతం పంపి ఉన్నాం. వారికి పలు ఖాతాలు ఉండడం, సీఎ్‌ఫఎంఎ్‌సతో సమస్య రావడంతో వేతనాలు అలస్యమవుతున్నాయి. 

 - రోజ్‌మాండ్‌, ఐసీడీఎస్‌ పీడీ

Updated Date - 2021-07-19T02:59:41+05:30 IST