పూజా హెగ్డే ఏం మాట్లాడినా.. ఇప్పుడామె చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రేక్షకులను కించపరిచేలా మాట్లాడిన ఆమె, ఒక్కసారిగా వ్యతిరేకత రావడంతో వెంటనే.. తన టీమ్‌తో ఓ లెటర్ని విడుదల చేయించింది. అయితే అంత వివాదం జరిగినా.. ఒక్క ట్వీట్ కూడా చేయని పూజా హెగ్డే.. టీమ్‌తో లెటర్ విడుదల చేయించిన తర్వాత కూడా స్పందించలేదు. ఇక మళ్లీ ఆమె అటువంటి వివాదంలోనే చిక్కుకుంది. అదేంటంటే.. రీసెంట్గా ఆమె 'అరవింద సమేత' సినిమా గురించి ప్రస్తావిస్తూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచేసింది. తారక్ తన ఎనర్జీకి మ్యాచ్ చేయగలిగే రేంజ్లో ఉంటాడని, అతనితో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చింది.
దీంతో.. అసలామె ప్లాప్ హీరోయిన్గా పడిన ముద్రని చెరిపేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్టయ్యారు. డీజేతో బ్రేక్ ఇచ్చింది బన్నీ.. అలాగే అల వైకుంఠపురముతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది బన్నీ.. కానీ బన్నీ గురించి చెప్పకుండా.. నా స్థాయికి ఎన్టీఆర్ బెటర్ అన్నట్లుగా ఆమె మాట్లాడటంతో.. బన్నీ ఫ్యాన్స్ ఆమెపై అలక వహించారు. ఈ విషయమే హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపైనైనా ఆమె స్పందిస్తుందో.. లేదంటే.. లైట్ తీసుకుంటుందో చూద్దాం.