HYD : తగ్గినట్లే తగ్గి మళ్లీ కరోనా కేసులు పెరిగిపోయాయ్..!

ABN , First Publish Date - 2022-01-14T16:29:00+05:30 IST

కొవిడ్‌ కేసులు రెండు, మూడు రోజులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకున్నాయి.

HYD : తగ్గినట్లే తగ్గి మళ్లీ కరోనా కేసులు పెరిగిపోయాయ్..!

హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌ కేసులు రెండు, మూడు రోజులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకున్నాయి. రోజురోజుకు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గురువారం విడుదల చేసిన హెల్త్‌బులెటిన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1328 మందికి వైరస్‌ సోకినట్లు పేర్కొంది. గడిచిన 13 రోజులలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 12,435 మందికి వైరస్‌ సోకింది. 


కూకట్‌పల్లిలో 109..

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి ప్రాంతంలో గురువారం 109 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


కుత్బుల్లాపూర్‌లో 88 .. 

కుత్బుల్లాపూర్‌: కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధితోపాటు దుండిగల్‌ పీహెచ్‌సీలో 88 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Updated Date - 2022-01-14T16:29:00+05:30 IST