పదేపదే అవే ఫిర్యాదులు

ABN , First Publish Date - 2022-05-28T07:02:43+05:30 IST

‘తహసీల్దార్లకు స్పందనపై పనిచేయడానికి ఆసక్తి ఉందా? చేద్దామా? స్పందన, రెవెన్యూ స్పందనలో వచ్చిన ఫిర్యాదులే మళ్లీ మళ్లీ రిపీట్‌ అవుతున్నాయి.

పదేపదే అవే ఫిర్యాదులు
స్పందనలో వచ్చిన ఫిర్యాదుపై మహిళా తహసీల్దార్‌తో మాట్లాడుతున్న కలెక్టర్‌

 స్పందనపై తహసీల్దార్లకు    ఆసక్తి ఉందా?

 రాబోయే స్పందనకు  భూవివాదాలపై   20 శాతమే ఉండాలి

 తహసీల్దార్లపై కలెక్టర్‌ ప్రసన్న    వెంకటేశ్‌ ఆగ్రహం 


ఏలూరు, మే 27(ఆంధ్రజ్యోతి): ‘తహసీల్దార్లకు స్పందనపై పనిచేయడానికి ఆసక్తి ఉందా? చేద్దామా? స్పందన, రెవెన్యూ స్పందనలో వచ్చిన ఫిర్యాదులే మళ్లీ మళ్లీ రిపీట్‌ అవుతున్నాయి. ఒకసారి వచ్చిన ఫిర్యాదును పరిష్కరిస్తే మళ్లీ ఎందుకొస్తారు? సర్వేయర్లను కూర్చోబెట్టి చర్చించాలి. స్పందన నుంచి ఏమేం ఫిర్యాదులు వచ్చాయో లిస్ట్‌ వేయించుకోండి. మీ మీ మండలాలకు కలెక్టర్‌ కంటే తహసీల్దార్‌కే గౌరవం ఎక్కువ. జనాలకు మీపై అంత గొప్ప నమ్మకం ఉంది. రాబోయే స్పందనకు రెవెన్యూ, భూ వివాదాలపై 20 శాతం మాత్రమే రావాలి. కేవలం 2–3కు మించి ఆ కంప్లైంట్స్‌ ఉండకూడదు.’ అంటూ తహసీల్దార్లపై కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన రెవెన్యూ స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వారంలో రెండు సార్లు నిర్వహిస్తున్న స్పందన, రెవెన్యూ స్పందనలో వచ్చిన ఫిర్యాదులే వస్తూండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పనిచేయని తహసీల్దార్ల కారణంగానే ఈ సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ స్పందనలో 132 అర్జీలు అందినట్లు కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో జేసీ అరుణ్‌బాబు, డీఆర్వో సత్యనారాయణ మూర్తి, ఆర్డీవోలు పెంచల కిశోర్‌, కె.రాజ్యలక్ష్మీ, ఎం. ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు. 


ఆన్‌లైన్‌ చేయడం లేదు..

తాను 2016లో తనకు కౌలుకు ఇచ్చిన మహిళ కృష్ణవేణి నుంచి ఎకరం పొలాన్ని కొనుగోలు చేసుకున్నామని, ఆమె అప్పుల్ని కూడా తానే తీరుస్తూ, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నానని చింతలపూడికి చెందిన రాంబాబు చెప్తున్నాడు. రిజిస్ర్టేషన్‌ పత్రాలు చూపించి తన పేరున రెవెన్యూ రికార్డుల్లో ఆన్‌లైన్‌ చేయించుకోవడం కోసం రెండుసార్లు మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేయగా రిజెక్ట్‌ చేస్తున్నారని చెప్తున్నాడు. రెండేళ్లుగా చింతలపూడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, మ్యుటేషన్‌ చేయడం లేదని, మే2న తొలిసారి, మే 27 మరో సారి స్పందనలో ఫిర్యాదులు చేసినా ఇప్పటికీ పరిష్కారం దొరకలేదని బాధి తుడు వాపోతున్నాడు. ఒక మహిళ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం సాక్షిగా రిజిస్ర్టేషన్‌ చేసి, ఇపుడు చేయలేదని అబద్దాలాడుతోందని అంటున్నాడు. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని, అయినా తహసీల్దార్‌, ఎస్‌ఐలు పట్టించుకోవడం లేదని వాపోయాడు.


పెరుగుతున్న అర్జీల సంఖ్య

ఎప్పటికపుడు స్పందన కార్యక్రమానికి అర్జీలు పోటెత్తుతున్నాయి.  రెవెన్యూ సమ స్యలపై ప్రత్యేక స్పందనను ఏర్పాటు చేసిన కలెక్టర్‌ సుమారు నెల నుంచి ఆ కార్యక్రమాన్ని నిర్వహింప జేస్తున్నారు. కానీ, ఈ క్రమంలో అధికారుల్లో కనిపిస్తోన్న సమన్వయలోపం, నిర్లక్ష్యం కారణంగా రెవెన్యూ స్పందన, స్పందన కార్యక్రమంలో ఒక్కో అర్జీ పదే పదే వస్తున్నాయి. 


 ఎన్నిసార్లు వచ్చినా పరిష్కారం లేదు 

‘నా పొలాన్ని ఒక రౌడీషీటర్‌ ఆక్రమించు కుంటే ఈ అధికారులు ఏంచేస్తున్నట్లు? ఈ స్పందనకు వస్తున్నామ న్న పేరే తప్ప పరిష్కా రాల ప్రసక్తే లేదు. కలెక్టర్‌ స్థాయిలో ఆదేశాలు ఇస్తున్నా, కింది స్థాయి అధికారులకు లెక్కే లేదు. ఇంక సామా న్యుడికి పరిష్కారం ఎక్కడ నుంచి దొరుకుతు ంది?’ అంటూ టి.నర్సాపురానికి చెందిన వీర య్య అనే వ్యక్తి తన ఆవేదనను స్పందన కార్య క్రమం వేదికగా వెళ్లగక్కాడు. పలుమార్లు ఇప్ప టికి స్పందనలో తన సమస్యను వివరించా నని, కింది స్థాయి అధికారులకు చెప్తున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడంలేదని బాధపడ్డాడు. ఒక్క వీరయ్యే కాదు.. కలెక్టర్‌ చెప్పినట్లుగా కింది స్థాయిలో తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ర్టార్లు, సర్వేయర్లు తమ పని తాము సరిగా నిర్వర్తి ంచని కారణంగానే ప్రజల్లో అధికారులు నమ్మ కం కోల్పోతున్నారు.




Updated Date - 2022-05-28T07:02:43+05:30 IST