మళ్లీ చార్జీల బాదుడు

ABN , First Publish Date - 2022-07-02T05:06:26+05:30 IST

రాష్ట్ర ప్రభుత ్వం మళ్లీ ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. రెండు నెలలు గడవక ముందే మరోసారి ప్రయాణికులపై బాదుడు కార్యక్రమాన్ని చేపట్టింది.

మళ్లీ చార్జీల బాదుడు

  1.  రెండు నెలలు గడవక ముందే ఆర్టీసీ వడ్డింపు
  2.  డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణికులపై భారం 
  3.  జిల్లాలో రోజుకు రూ.10 లక్షలు అదనపు మోత

కర్నూలు(రూరల్‌), జూలై 1: రాష్ట్ర ప్రభుత ్వం మళ్లీ ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. రెండు నెలలు గడవక ముందే మరోసారి ప్రయాణికులపై బాదుడు కార్యక్రమాన్ని చేపట్టింది. డీజిల్‌ సెస్‌ పేరుతో వసూలు చేస్తున్న ఈ అదనపు చార్జీలన్నీ ప్రయాణికులపై మరింత భారంగా మారనున్నాయి. గ్రామీణ ప్రజలు ని త్యం ప్రయాణించే పల్లె వెలుగు మొదలుకుని, ఏసీ సర్వీసుల వ రకు అన్నింటిపైన అదనంగా చార్జీలను వడ్డించారు. పల్లెవెలుగుపై ప్రతి కిలోమీటర్‌కు 21పైసలు, అలా్ట్ర డీలక్స్‌పై 25 పైసలు, సూపర్‌లగ్జరీ బస్సుల్లో 26పైసలు, ఏసీ బస్సులకు 35 పైసలు చొప్పున అదనపు చార్జీలను పెంచారు. ఈ చార్జీలు శుక్రవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.  

ఫ ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి...

ఉమ్మడి జిల్లాల్లో 12 డిపోలు ఉన్నాయి. కర్నూలు జిల్లాకు కర్నూలు-1, కర్నూలు-2, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ డిపోలు ఉన్నాయి. ఈ జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులు 370, అద్దె బస్సులు 41 తిరుగుతున్నాయి. నంద్యాల జిల్లా పరిధిలో ఏడు డిపోలు ఉన్నాయి. ఈ జిల్లా పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆత్మకూరు, డోన డిపోలు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 625 ఉండగా, అద్దె బస్సులు 124 ఉన్నాయి. మొత్తం 925 బస్సులు ఉమ్మడి జిల్లాలో 3.20 లక్షల కిలోమీటర్ల వరకు నిత్యం తిరుగుతున్నాయి. 

ఫ రోజుకు రూ.10 లక్షల భారం...

ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసుల సేవలను మూడు లక్షల మంది ప్రయాణికులు నిత్యం వినియోగించుకుంటున్నారు. పెరిగిన అదనపు చార్జీలతో ప్రయాణికులపై రోజుకు రూ.10 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.3 కోట్ల భారం పడనుంది. ఏడాదికి రూ. 36 కోట్ల వరకు ఆర్టీసీకి ఆదనపు ఆదాయం సమకూరనుంది. జిల్లాలో ఆర్టీసీ ద్వారా రోజుకు సగటున రూ.60 లక్షల మేరకు వసూలవుతూ... నెలకు రూ.18 కో ట్ల ఆదాయం సమకూరుతోందని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటరామం తెలిపారు.  


Updated Date - 2022-07-02T05:06:26+05:30 IST