Advertisement
Advertisement
Abn logo
Advertisement

చనిపోయిన ఫ్రెండ్ భార్యతో ఐదేళ్లుగా ప్రేమాయణం.. చివరకు ఈ యువకుడి పరిస్థితి ఎలా తయారయిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె తన స్నేహితుడి భార్యే! కానీ అతడు అకస్మాత్తుగా మరణించడంతో ఆమె ఒంటరైంది. దీన్ని ఓ జవాను అవకాశంగా తీసుకున్నాడు. ఆమెతో స్నేహం చేయడం ప్రారంభించాడు. సాన్నిహిత్యం మరింతగా పెంచుకుని చివరికి ఆమెతో సహజీవనం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానంటూ చేతిలో చేయ్యేసి మరీ ప్రమాణం చేశాడు. ఆమేమో అతడి మాటలను నమ్మింది. ఒంటరి జీవితంలో ఓ తోడు దొరికిందని మురిసిపోయింది. భర్త లేడనే బాధను మరిచిపోయి అతడికి దగ్గరైయింది. 

కానీ.. ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు టాపిక్ మార్చేసేవాడు. రెపు మాపు అంటూ ఆమెను మభ్య పెట్టేవాడు. కానీ ఆమె మాత్రం అతడు తనను ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాడనుకుంటూ ఏళ్ల తరబడి ఓపిగ్గా ఎదురు చూసింది. అతడు మాత్రం ఆర్మీ సెలవులపై ఊరికి రావడంతో ఆమెతో సరదాగా గడపటం.. మళ్లీ యధాప్రకారం వెళ్లిపోవడం చేస్తుండేవాడు. దీంతో.. ఇటీవల కాలంలో ఆమె పెళ్లికై పట్టుబట్టడం ప్రారంభించింది. దీంతో.. యువకుడి అసలు రంగు క్రమంగా బయటపడసాగింది. ఈ విషయంలో ఓ రోజు వారి మధ్య పెద్ద గొడవ జరగడంతో..  పెళ్లి చేసుకునేది లేదంటూ ఆమెకు తేల్చి చెప్పాడు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాల్లో చోటుచేసుకుందీ ఘటన. 

ఇది కూడా చదవండి: రాత్రి వేరువేరుగా పడుకున్నారు.. తెల్లవార్జామున భార్య గదిలోకి వెళితే..

ఇది కూడా చదవండి: భార్యపై అనుమానం.. స్నేహితుల ముందే ఆమెను నీచంగా..

ఇంతకాలం తనతో ప్రేమనటిస్తూ వచ్చిన అతడి నిజస్వరూపం చూశాక.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి తన అవసరాలు తీర్చుకున్నాడంటూ అతడిపై అత్యాచారం కేసు పెట్టింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు చురేంద్ర దేవ్ కుంజామ్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ నుంచి సెలవులపై వచ్చిన అతడిని అరెస్టు చేశారు. దీంతో ఆమెను ఇన్నాళ్లూ పెళ్లి పేరుతో మోసం చేస్తూ వచ్చిన అతడి జీవితం ఒక్కసారిగా తారుమారయిపోయింది. చక్కటి ఉద్యోగం, మంచి లైఫ్‌ను అనుభవించాల్సిన అతడు కాస్తా.. పెడదోవ పట్టి చివరకు కటకటాల పాలవ్వాల్సి వచ్చింది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement