Viral: అంత లోతు నీళ్లలో పడిపోయి అన్ని నెలలు ఉన్నా ఈ ఫోన్ ఇంకా పనిచేస్తుందంటే..

ABN , First Publish Date - 2022-06-25T22:17:00+05:30 IST

‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు’ ఖలేజా సినిమాలో త్రివిక్రమ్ చెప్పించిన మాటలివి. నిజమే.. అలాంటి అద్భుతం గురించే..

Viral: అంత లోతు నీళ్లలో పడిపోయి అన్ని నెలలు ఉన్నా ఈ ఫోన్ ఇంకా పనిచేస్తుందంటే..

‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు’ ఖలేజా సినిమాలో త్రివిక్రమ్ చెప్పించిన మాటలివి. నిజమే.. అలాంటి అద్భుతం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆ అద్భుతం ఏంటంటే.. మనం వాడుతున్న మొబైల్ ఫోన్ (Mobile Phone) పది నెలల క్రితం నదిలో కొట్టుకుపోయి మళ్లీ దొరుకుందని ఎవరైనా అనుకుంటామా..? పోనీ.. దొరికిందే అనుకుందాం.. అన్ని రోజుల పాటు నీళ్లలో నానిపోయిన ఆ ఫోన్ వర్కింగ్ కండీషన్‌లో ఉండి పనిచేస్తుందని భావిస్తామా..? ‘అలా ఎలా పనిచేస్తుందండీ’ అని ఎదురు ప్రశ్నిస్తాం. కానీ.. ఈ వ్యక్తి విషయంలో అదే జరిగింది. నమ్మక తప్పని నిజం ఇది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. యూకేకు (UK) చెందిన ఒవైన్ డెవిస్ అనే వ్యక్తి 2021లో సిండర్‌ఫోర్డ్ సమీపంలోని River Wye దగ్గర బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీ చేసుకున్న సందర్భంలో పొరపాటున అతని ఐఫోన్ (iPhone) నది నీటిలో పడిపోయింది. చేసేదేమీ లేక ఫోన్ పోయిందని బాధతో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.



దాదాపు పది నెలల తర్వాత మిగేల్ పచేకో అనే వ్యక్తి కుటుంబంతో కలిసి అదే నదిలో కెనోయింగ్‌కు(Canoeing) వెళ్లాడు. ఆ సందర్భంలో డెవిస్ ఫోన్ అతనికి దొరికింది. ఆ ఐ ఫోన్ ఎవరిదో తెలుసుకునేందుకు.. ఫేస్‌బుక్‌లో అతనికి దొరికిన ఐఫోన్ గురించి పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో కొన్ని ఆశ్చర్యకర విషయాలను మిగేల్ పంచుకున్నాడు. ఆ ఫోన్ పనిచేస్తుందని తాను అస్సలు అనుకోలేదని, ఆ ఫోన్‌లోకి నీళ్లు చాలా పోయాయని చెప్పాడు. ఆ ఫోన్ ఇక పనిచేయదనుకుని వదిలేసినప్పటికీ.. ఒకసారి ప్రయత్నించి చూద్దామని ఫోన్‌లో ఉన్న నీళ్లను ఒంపి ఛార్జింగ్ పెట్టి చూశాడు. ఆ తర్వాత అతను కళ్లతో చూసిన దాన్ని నమ్మలేకపోయాడు.



ఫోన్ చార్జింగ్ అవుతూ ఆన్‌ చేయగానే ఆన్ అయింది. ఆగస్ట్ 13 డేట్‌తో భార్యాభర్తల ఫొటోతో స్క్రీన్ సేవర్ కనిపించింది. ఆ ఆగస్ట్ 13నే ఆ ఐ ఫోన్‌ను డెవిస్ పోగొట్టుకున్నాడు. ఆ స్క్రీన్ సేవర్‌ను ఫొటో తీసి మిగేల్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. దాదాపు 4000 సార్లకు పైగా ఆ పోస్ట్ షేర్ అయింది. అయితే.. డెవిస్ సోషల్ మీడియాను ఉపయోగించడు. కానీ.. అతని ఫ్రెండ్స్‌ మిగేల్ పోస్ట్ చూసి ఆ ఫోన్ డెవిస్‌దని కనుగొనడంతో ఎట్టకేలకు ఆ ఫోన్ యజమాని దగ్గరకు చేరింది. నదిలో కెనోయింగ్ చేస్తున్న సమయంలోనే ఆ ఫోన్ పోయిందని.. ఇన్నాళ్లకు మళ్లీ తన దగ్గరకు చేరుకుందని, పనిచేస్తుందని ఊహించలేదని డెవిస్ చెప్పాడు. మిగేల్ పచేకో తన ఫోన్‌ను తన దగ్గరకు చేర్చడానికి చూపించిన చొరవకు పచేకోకు డెవిస్ కృతజ్ఞతలు తెలిపాడు. ఐఫోన్ విడుదల చేస్తున్న తాజా ఫోన్లన్నీ IP68 ratedవే కావడం గమనార్హం. అంటే.. ఐఫోన్ 1.5 మీటర్ల లోతులో కూడా 30 నిమిషాల పాటు యథాతథంగా పనిచేసేలా ఐఫోన్లు తయారవుతున్నాయి. కానీ.. ఇన్ని నెలల పాటు అంత లోతు నీళ్లలో, బురదలో ఉన్నప్పటికీ ఫోన్ పనిచేస్తుండటం అంటే మిరాకిల్ అనే చెప్పక తప్పదు.

Updated Date - 2022-06-25T22:17:00+05:30 IST