పురిటినొప్పులు పడుతున్న pregnant lady...అత్యవసరంగా జేసీబీలో ఆసుపత్రికి తరలింపు

ABN , First Publish Date - 2022-01-07T16:47:52+05:30 IST

విస్తారంగా మంచు కరుస్తున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని అత్యవసరంగా జేసీబీలో ఆసుపత్రికి తరలించిన...

పురిటినొప్పులు పడుతున్న pregnant lady...అత్యవసరంగా జేసీబీలో ఆసుపత్రికి తరలింపు

అనంతనాగ్: విస్తారంగా మంచు కరుస్తున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని అత్యవసరంగా జేసీబీలో ఆసుపత్రికి తరలించిన ఘటన జమ్మూకశ్మీరులోని అనంతనాగ్ జిల్లాలో వెలుగుచూసింది. అనంతనాగ్ జిల్లాలో విస్తారంగా మంచు కురుస్తున్న ప్రతికూల వాతావరణం మధ్య తమ గ్రామానికి చెందిన గర్భిణీకి వైద్యసహాయం అందించమని ఓ గ్రామ సర్పంచ్ నుంచి పీఎంజీఎస్ వై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మహ్మద్ సుల్తాన్‌కు ఫోన్ వచ్చింది. దీంతో సుల్తాన్ స్పందించి వాతావరణ ప్రతికూల పరిస్థితుల మధ్య వారి వద్ద అందుబాటులో ఉన్న జేసీబీలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.


అంబులెన్స్ అందుబాటులో లేకపోయినా సకాలంలో స్పందించి జేసీబీలోనే గర్భిణీని ఆసుపత్రికి సురక్షితంగా తరలించామని సుల్తాన్ చెప్పారు.డెలివరీ పీరియడ్ దగ్గర ఉన్న గర్భిణులు అత్యవసర పరిస్థితులను నివారించడానికి వారు అనుకున్న తేదీకి ముందే సమీప ఆసుపత్రులకు చేరుకోవాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రజలను కోరారు. 


Updated Date - 2022-01-07T16:47:52+05:30 IST