భయంతో టాయ్‌లెట్ సీట్లో కరెన్సీ కట్టలను దాచిన హెడ్‌ కానిస్టేబుల్.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-08T22:31:40+05:30 IST

అతను డీఎస్పీ దగ్గర పనిచేసే ఓ హెడ్ కానిస్టేబుల్.. ఇటీవల డీఎస్పీ దగ్గరకు ఓ మహిళ వెళ్లింది..

భయంతో టాయ్‌లెట్ సీట్లో కరెన్సీ కట్టలను దాచిన హెడ్‌ కానిస్టేబుల్.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

అతను డీఎస్పీ దగ్గర పనిచేసే ఓ హెడ్ కానిస్టేబుల్.. ఇటీవల డీఎస్పీ దగ్గరకు ఓ మహిళ వెళ్లింది.. తనపై సామూహిక అత్యాచారం జరిగిందని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది.. హెడ్ కానిస్టేబుల్ చేత కేసు నమోదు చేయించుకోమని డీఎస్పీ ఆ మహిళతో చెప్పారు.. అయితే కేసు నమోదు చేసుకునేందుకు ఆ హెడ్ కానిస్టేబుల్ రూ.3 లక్షల లంచం అడిగాడు.. దీంతో ఆ మహిళ యాంటీ కరెప్షన్ బ్యూరో (ఏసీబీ) సిబ్బందిని ఆశ్రయించింది. 


రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ఓ మహిళ కొన్ని రోజుల కిందట అదృశ్యమైంది. వారం రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరింది. వెంటనే డీఎస్పీ పార్థ్ శర్మ దగ్గరకు వెళ్లి తనపై భర్త, అతని సోదరుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించేందుకు హెడ్ కానిస్టేబుల్ భాగ్‌చంద్ దగ్గరకు వెళ్లింది. ఎఫ్ఐఆర్ రాసేందుకు భాగ్‌చంద్ రూ.3 లక్షల లంచం అడిగాడు. దీంతో ఆ మహిళ ఏసీబీని ఆశ్రయించింది. విచారించిన ఏసీబీ అధికారులు ఆ మహిళ నిజమే చెబుతోందని ధ్రువీకరించుకున్నారు. 


సోమవారం సాయంత్రం రూ.60 వేలు ఆమెకు ఇచ్చి భాగ్‌చంద్ ఇంటికి పంపారు. ఆమె నుంచి భాగ్‌చంద్ డబ్బులు తీసుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. వారి రాకను పసిగట్టిన భాగ్‌చంద్ ఆ డబ్బులను టాయ్‌లెట్ సీటు కింద దాచాడు. రెయిడ్ చేసిన అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకుని, భాగ్‌చంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో డీఎస్పీ పాత్ర గురించి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-02-08T22:31:40+05:30 IST