నిన్న సల్మాన్... నేడు సైఫ్, కరీనా... తప్పని ‘పరీక్ష’

ABN , First Publish Date - 2021-09-16T03:11:30+05:30 IST

సైఫ్, కరీనా జంటకు ఎయిర్‌పోర్ట్‌లో ‘పరీక్ష’ తప్పలేదు. అధికారులు బాలీవుడ్ స్టార్ కపుల్‌ని లోనికి ప్రవేశిస్తుండగా ఆపి, వారి ఐడీస్ చెక్ చేశారు. వారితో పాటూ ప్రయాణిస్తోన్న పిల్లలు తైమూర్, జహంగీర్, వారి కోసం నియమింపబడ్డ ఆయాల్ని కూడా చెక్ చేశారు.

నిన్న సల్మాన్... నేడు సైఫ్, కరీనా... తప్పని ‘పరీక్ష’

సైఫ్, కరీనా జంటకు ఎయిర్‌పోర్ట్‌లో ‘పరీక్ష’ తప్పలేదు. అధికారులు బాలీవుడ్ స్టార్ కపుల్‌ని లోనికి ప్రవేశిస్తుండగా ఆపి, వారి ఐడీస్ చెక్ చేశారు. వారితో పాటూ ప్రయాణిస్తోన్న పిల్లలు తైమూర్, జహంగీర్, వారి కోసం నియమింపబడ్డ ఆయాల్ని కూడా చెక్ చేశారు. అందరి ధృవీకరణ పత్రాలు సరి చూశాకే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)  ఆఫీసర్ సైఫ్, కరీనా బృందాన్ని ముందుకు వెళ్లేందుకు అనుమతించారు.


ఆగస్ట్ నెలలో సల్మాన్ కూడా ఎయిర్‌పోర్ట్ చెకింగ్ విషయంలోనే వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ కండల వీరుడ్ని రూల్స్ ప్రకారం సీఐఎస్ఎఫ్ అఫీషియల్ నిలువరించాడు. చెకింగ్ తనిఖీ తరువాత సల్మాన్ ముందుకు సాగాడు. అయితే, తరువాత సదరు అధికారిపై వేటు పడిందంటూ వార్తలొచ్చాయి. కానీ, అటువంటిదేం లేదని సీఐఎస్ఎఫ్ వివరణ ఇచ్చింది. నిక్కచ్చిగా తన డ్యూటీని చేసిన ఆయనకు తగిన రివార్డ్ ఇచ్చామని కూడా ట్విట్టర్‌లో ప్రకటించారు. 


ఈ మధ్యే మాల్దీవ్స్‌కు వెళ్లొచ్చిన సైఫ్, కరీనా ప్రస్తుతం పిల్లలతో కలసి ఫారిన్ డెస్టినేషన్స్‌లో హోల్ ఫ్యామిలీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు...  

  

Updated Date - 2021-09-16T03:11:30+05:30 IST