బస్సులో మహిళకు టికెట్ ఇచ్చిన కండక్టర్.. దాని వెనుక అతడు రాసింది చూసిన మహిళ షాక్.. ఏకంగా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు!

ABN , First Publish Date - 2021-12-24T20:29:28+05:30 IST

ఆమె డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ బస్ ఎక్కింది.. టికెట్ కోసం కండక్టర్‌కు డబ్బులు ఇచ్చింది..

బస్సులో మహిళకు టికెట్ ఇచ్చిన కండక్టర్.. దాని వెనుక అతడు రాసింది చూసిన మహిళ షాక్.. ఏకంగా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు!

ఆమె డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ బస్ ఎక్కింది.. టికెట్ కోసం కండక్టర్‌కు డబ్బులు ఇచ్చింది.. ఆ టికెట్ వెనకాల కండక్టర్ ఏదో రాయడం గమనించింది.. తిరిగి ఇచ్చేందుకు చిల్లర లేక టికెట్ వెనకాల రాస్తున్నాడని అనుకుంది.. తీరా టికెట్ తీసుకుని చూసి షాక్‌కు గురైంది.. ఆ టికెట్‌పై కండక్టర్ తన మొబైల్ నెంబర్ రాశాడు.. కాల్ చేయమని సైగ చేశాడు.. దీంతో సదరు మహిళ ఏకంగా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.. హర్యానాలో ఈ ఘటన జరిగింది. 


బాధిత మహిళ ఈ నెల 20వ తేదీన హర్యానా రోడ్‌వేస్‌ నడుపుతున్న బస్ ఎక్కింది. టికెట్ తీసుకునేందుకు కండక్టర్‌ మహేంద్ర‌కు డబ్బులు ఇచ్చింది. ఆ టికెట్ వెనకాల కండక్టర్ తన మొబైల్ నెంబర్ రాసి ఆమెకు ఇచ్చాడు. టికెట్ చూసుకుని ఆ మహిళ షాకైంది. ఆ ఘటన గురించి ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ రాసింది. ఫిర్యాదును స్వీకరించిన మహిళా కమిషన్ రవాణా శాఖ నుంచి వివరణ కోరింది.


ప్రభుత్వ టిక్కెట్లపై మహిళలకు వ్యక్తిగత నంబర్లు రాసి ఇవ్వడం పరోక్షంగా వేధింపుల కిందకే వస్తుందని మహిళా శాఖ పేర్కొంది. విషయం తెలుసుకున్న రవాణా శాఖ కల్కా సబ్ డిపోలో పనిచేస్తున్న మహేంద్రపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ ఘటనపై విచారణ జరిపి రెండ్రోజుల్లో నివేదిక పంపాలని సంబంధిత అధికారులను రవాణా శాఖ అదేశించింది. 


Updated Date - 2021-12-24T20:29:28+05:30 IST