పెళ్లయిన రోజే ఓ రహస్యాన్ని చెప్పిన నవ వధువు.. కోర్టుకెళ్లి మరీ పెళ్లిని రద్దు చేసుకున్న భర్త.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-04-10T00:30:19+05:30 IST

ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూదని ఆ నవవధువు భావించింది. భర్త అర్థం చేసుకుని తనను ఆదరిస్తాడని నమ్మింది. తనకు జరిగిన అన్యాయాన్ని పెళ్లైన మొదటి రాత్రే భర్తకు చెప్పేసింది. ఈ క్రమం

పెళ్లయిన రోజే ఓ రహస్యాన్ని చెప్పిన నవ వధువు.. కోర్టుకెళ్లి మరీ పెళ్లిని రద్దు చేసుకున్న భర్త.. అసలు కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూదని ఆ నవవధువు భావించింది. భర్త అర్థం చేసుకుని తనను ఆదరిస్తాడని నమ్మింది. తనకు జరిగిన అన్యాయాన్ని పెళ్లైన మొదటి రాత్రే భర్తకు చెప్పేసింది. ఈ క్రమంలో అతడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే ఆమెను తన పుట్టింట్లో వదిలేశాడు. అంతేకాకుండా కోర్టుకెక్కి  విడాకులు తీసుకున్నాడు. అసలు కథేంటనే వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన 25ఏళ్ల యువకుడికి, 21ఏళ్ల యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో పెళ్లైన తొలిరాత్రే ఆ నవవధువు తనకు జరిగిన అన్యాయాన్ని తన భర్తకు వెల్లడించింది. పెళ్లికి ముందు బంధువుల అబ్బాయి తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఆ మాటలు వినడంతో అతడు షాకయ్యాడు. మరుసటి రోజే అమెను తన పుట్టింట్లో వదిలేశాడు. అనంతరం విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో అందులో తన తప్పు ఏ మాత్రం లేదని ఆ నవవధువు నిరూపించుకోనేందుకు ప్రయత్నించింది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు కూడా నమోదు చేసింది. అయితే ఆమె మాటలను అతడు వినిపించుకోలేదు. విడాకులు కావాల్సిందేనని పట్టుపట్టాడు. ఈ క్రమంలోనే విచారణ కోసం కోర్టుకు హాజరుకావాల్సిందిగా కొద్ది రోజుల క్రితం కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆమె కోర్టుకు గైర్హాజరుకావడంతో విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. 




Updated Date - 2022-04-10T00:30:19+05:30 IST