పెళ్లి తర్వాత బాలీవుడ్‌లో సినిమాలకు Katrina Kaif టాటా చెప్పనుందా..?

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని  సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. కానీ, ఈ వార్తలపై  ఇప్పటి వరకు వీరిద్దరూ స్పందించలేదు. వీరి వివాహానికి అతిరథ మహారథులందరూ హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. పీఏమ్‌వో అధికారులు కూడా వీరి పెళ్లికి హాజరుకాబోతున్న గెస్ట్ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. 


అతిథుల కోసం ఇప్పటికే 40కి పైగా హోటల్స్‌ని బుక్ చేశారని వారి సన్నిహితులు తెలుపుతున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఎక్కడ కూడా లీక్ కావొద్దని వారు భావిస్తున్నారు. అందువల్ల వివాహం జరిగే ప్రాంతంలో సెల్‌ఫోన్‌లను అనుమతినించట్లేదు. అయితే, కత్రినా పెళ్లి అనంతరం సినిమాలకు టాటా చెప్పనుందా ..? జీవితంలో  కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతుందా..? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చింది.


‘‘ పెళ్లి అనంతరం సినిమాలకు టాటా చెప్పాలనిపిస్తే తప్పక చెబుతాను. కానీ,  సినిమాలకు టాటా చెప్పామని నా భర్త నన్ను బలవంతం చేయకూడదు. నా మనసు అలా చేయమని చెప్తే బాలీ‌వుడ్‌ను వదిలివేస్తాను. పెళ్లి అనంతరం తక్కువ చిత్రాలు మాత్రమే చేస్తాను ’’ అని ఆమె గతంలో ఇక ఇంటర్వ్యూ‌లో వివరించింది. 


కత్రినా కైఫ్ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుందని అభిమానులందరికి తెలిసిన సంగతి తెలిసిందే. అందుకే కొంచెం విరామం లభిస్తే చాలు లండన్‌లోని తల్లి, సోదరిల దగ్గరికి ఆమె వెళుతోంది. 

Advertisement

Bollywoodమరిన్ని...