Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లయిన కొద్ది గంటల్లోనే ఇంట్లోంచి బయటకు వెళ్లిన నవ వరుడు.. ఫోన్ చేసి అతడు చెప్పింది విని నివ్వెరపోయిన బంధువులు..!

అతడి పేరు దినేష్.. రాజస్థాన్‌కు చెందిన దినేష్ రైల్వేలో ఉద్యోగి. గత ఆదివారం ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం భార్యతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. ఇంతలో అతనే ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు షాకింగ్ విషయం చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. షాకైన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాజస్థాన్‌లోని విరాట్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 


ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన దినేష్ భోపాల్‌గఢ్ కోట గోడపైకి ఎక్కాడు. అక్కడి నుంచి అన్నయ్యకు ఫోన్ చేసి తన ఆత్మహత్య విషయం చెప్పాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి భోపాల్‌గఢ్ కోటకు చేరుకున్నారు. స్థానిక పోలీసులలతో పాటు డీఎస్పీ విజయ్ కుమార్, తహసీల్దార్ వివేక్ కటారియా కూడా భోపాల్‌గఢ్ కోటకు చేరుకుని యువకుడిని ఒప్పించి కిందకు దించే ప్రయత్నం చేశారు. అయితే దినేష్ అందుకు అంగీకరించలేదు. తన సమస్యను ఎవరూ పరిష్కరించలేరని, అందుకే తాను చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు. తనవైపు ఎవరైనా వస్తే దూకేస్తానని బెదిరించాడు.


పోలీసులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు దినేష్‌కు ఎంతగానో నచ్చచెప్పారు. దాదాపు ఆరు గంటల ప్రయత్నం తర్వాత కిందకు దిగి వచ్చేందుకు దినేష్ అంగీకరించాడు. దినేష్‌ అన్నయ్య సుబే సింగ్‌, బావ సందీప్‌ అతడిని గోడపై నుంచి కిందకు దించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణమెంటో తెలుసుకునేందుకు పోలీసులు, కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement