Abn logo
Sep 25 2021 @ 15:04PM

జితేంద్ర గోగి హత్యతో ఢిల్లీ జైళ్లలో హైఅలర్ట్

న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని రోహిణి కోర్టు హాలులో విచారణ ఖైదీ జితేంద్ర గోగి దారుణ హత్యా ఘటన నేపథ్యంలో దేశ రాజధానిలోని అన్ని జైళ్లలో హైఅలర్ట్ ప్రకటించారు. డీజీపీ సందీప్ గోయెల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. జైళ్లలో భద్రతను కట్టుదిట్టడం చేయడంతో పాటు, గ్యాంగ్ మెంబర్లందరిపైనా గట్టి నిఘా ఉంచినట్టు గెయెల్ శనివారంనాడు మీడియాకు తెలిపారు. 11 పాయింట్లతో కూడిన జాబితాను అన్ని జైళ్లు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు.

ప్రత్యర్థి గ్యాంగు సభ్యులను గుర్తించడం, గ్యాంగు సభ్యులను కోర్టులు, ఆసుపత్రులు, బయట ప్రదేశాలకు తీసుకు వెళ్లేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ఒకే జైలులో ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులను ఉంచినట్లయితే ఏకకాలంలో వాళ్ల సెల్స్ తెరవకుండా చూడటం వంటివి ఈ జాగ్రత్తల్లో కొన్ని. జైళ్లలోనే వీడియో కాన్ఫరెన్స్‌కు కానీ, ఇంటిమేట్ కాలింగ్ సిస్టం, క్యాంటీన్ తదితరాలకు ఖైదీలు వెళ్లేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా ఆ ఆదేశాల్లో డీజీపీ పేర్కొన్నారు. గరిష్ట సంఖ్యలో సిబ్బందిని జైళ్లలో మోహరించడం, సెక్యురిటీ సామగ్రిని వర్కింగ్ ఆర్టర్‌లో ఉంచుకోవడం, ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తితే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య, పారా-మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచడం వంటివి కూడా కీలకంగా ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. సూపరింటెండెంట్లు జైళ్లలో ఎక్కువసేపు అందుబాటులో ఉండాలని, తనిఖీలు చేస్తుండాలని డీజీపీ ఆదేశించారు.