Advertisement
Advertisement
Abn logo
Advertisement

భోజనం తరువాత ఇలా చేస్తే..!

కొంతమంది భోజనం చేయగానే కాఫీ లేదా టీ తాగుతారు. కానీ ఇలా చేయడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే శరీరం ఐరన్‌ను గ్రహించడాన్ని టీ నిలువరిస్తుంది. అందుకే భోజనం చేసిన తరువాత ఒక గంట వరకు టీ తీసుకోకూడదు.


పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ భోజనం తరువాత మాత్రం కాదు. భోజనం తరువాత పండ్లు తింటే జీర్ణసమస్యలు వస్తాయి. శరీరం గ్రహించే పోషకవిలువల్లోనూ తేడా వస్తుంది.

భోజనం చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కవుట్స్‌ చేయకూడదు. ఒకవేళ చేస్తే పొట్ట అసౌకర్యానికి గురవుతుంది.

భోజనం తరువాత స్నానం చేస్తే ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. షవర్‌ చేస్తే రక్తం ఆహారం జీర్ణంకావడానికి సహాయం చేయడానికి బదులుగా, శరీరంలో ఇతర భాగాలకు సరఫరా అవుతుంది. 

భోజనం తరువాత నిద్ర కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. భోజనం చేయగానే నిద్రకు ఉపక్రమిస్తే జీర్ణరసాలు అధికమొత్తంలో ఉత్పత్తి అయి గుండెలో మంట వంటి సమస్యలు వస్తాయి. మొత్తం జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది.


Advertisement
Advertisement