Chinese Spy Ship : భారత్, అమెరికాలకు చైనా హెచ్చరిక

ABN , First Publish Date - 2022-08-16T22:19:59+05:30 IST

శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయానికి యువాన్ వాంగ్ 5 (Yuan Wang 5) నౌక చేరుకున్న

Chinese Spy Ship : భారత్, అమెరికాలకు చైనా హెచ్చరిక

కొలంబో : శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయానికి యువాన్ వాంగ్ 5 (Yuan Wang 5) నౌక చేరుకున్న నేపథ్యంలో భారత్, అమెరికాలను చైనా హెచ్చరించింది. తాము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే సైంటిఫిక్ రీసెర్చ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని, మూడో పక్షం జోక్యం చేసుకోరాదని తెలిపింది. ఈ నౌకకు మంగళవారం ఉదయం శ్రీలంక నుంచి ఘన స్వాగతం లభించింది. 


చైనా ప్రభుత్వ మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రకారం, చైనీస్ సైంటిఫిక్ రీసెర్చ్ నౌక యువాన్ వాంగ్ 5 (Yuan Wang 5) శ్రీలంకలోని హంబంటోటా పోర్ట్‌ (Hambantota port)కు మంగళవారం ఉదయం చేరుకుంది. చైనా రాయబారి కీ జెన్‌హాంగ్ (Qi Zhenhong) నిర్వహించిన స్వాగత కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) ప్రతినిధులతో సహా అనేక మంది శ్రీలంక ఉన్నతాధికారులు హాజరయ్యారు. 


హంబంటోటా నౌకాశ్రయం (Hambantota Port)లోకి చైనీస్ గూఢచర్య నౌక రావడంపై భారత్, అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నౌక ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ నౌకాశ్రయంలో ఉంటుందని మొదట్లో ప్రకటించారు. అయితే మరిన్ని చర్చలు అవసరమని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) నేతృత్వంలోని ప్రభుత్వం చెప్పింది. కానీ చైనా ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. దివాలా తీసిన శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) రుణాలను అడ్డుకుంటామని చైనా హెచ్చరించడంతో శ్రీలంక తలొగ్గక తప్పలేదు. శ్రీలంక మాజీ పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి, మాజీ నావికా దళ చీఫ్ రియర్ అడ్మిరల్ సరత్ వీరసేకర (Sarath Weerasekara) లాబీయింగ్ కారణంగా ఈ నౌక మంగళవారం ఉదయం ఈ నౌకాశ్రయానికి చేరుకుంది. ఇది ఈ నెల 21 వరకు ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు. 


ఈ నౌక మంగళవారం ఉదయం హంబంటోటా నౌకాశ్రయానికి చేరుకున్న తర్వాత చైనా (China) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ నౌక సైంటిఫిక్ రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పింది. మూడో పక్షాల జోక్యం ఉండకూడదని హెచ్చరించింది. ఈ నౌకను ఇక్కడ నిలిపిన తర్వాత  అవసరమైన రీసప్లయ్‌ని పూర్తి చేయడం కోసం కొంత సమయం పడుతుందని తెలిపింది. 


యువాన్ వాంగ్ 5 నౌకను హంబంటోటా నౌకాశ్రయంలో నిలపడాన్ని భారత దేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆసియా-యూరోప్ నౌకాయాన ప్రధాన మార్గానికి సమీపంలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని చైనా సైనిక స్థావరంగా ఉపయోగించుకుంటుందేమోననే ఆందోళనను వ్యక్తం చేసింది. 


అంతరిక్షంలోని వస్తువులను గుర్తుపట్టగలిగే హైటెక్ సదుపాయాలు ఈ నౌకలో ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం దివాలా తీసిన శ్రీలంకకు భారత్, చైనాల సహకారం తప్పనిసరి. కాబట్టి ఈ నౌకాశ్రయంలో ఈ నౌకను ఆగస్టు 11 నుంచి ఐదు రోజులపాటు నిలిపేందుకు అననుమతించింది. భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొంత కాలం వాయిదా వేయాలని చైనాను కోరింది. 


శ్రీలంక మీడియా మంత్రి బందుల గుణవర్దన (Bandula Gunawardana) విలేకర్లతో మాట్లాడుతూ, భారత దేశం అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, అందువల్ల సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలు పూర్తయ్యే వరకు ఈ నౌకను హంబంటోటాకు తీసుకురావడాన్ని జాప్యం చేయాలని చైనాను కోరామని చెప్పారు. గతంలో కూడా భారత్, అమెరికా, తదితర దేశాల నౌకలు శ్రీలంక (Sri Lanka)కు వచ్చినట్లు తెలిపారు. ఆ నౌకలను తాము అనుమతించామని, అదేవిధంగా యువాన్ వాంగ్ 5ని కూడా అనుమతించామని అన్నారు. 


Updated Date - 2022-08-16T22:19:59+05:30 IST