బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యెడియూరప్ప రాజీనామా ప్రకటన అనంతరం రాజ్ భవన్ చుట్టూ రాజకీయం సాగుతోంది. యెడియూరప్ప మంత్రివర్గంలోని సీనియర్ సభ్యులు రాజ్ భవన్ బాట పట్టారు. పలువురు సీనియర్ మంత్రులు గవర్నరును కలిసేందుకు రాజ్ భవన్ కు తరలిరావడంతో తదుపరి కర్ణాటక సీఎం ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. యెడియూరప్ప బాగా పనిచేశారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు.సోమవారం 12.32 గంటలకు సీఎంగా యెడియూరప్ప రాజీనామా ప్రకటన తర్వాత పలువురు అగ్ర మంత్రులు రాజ్ భవన్ కు చేరుకున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావాడి, వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్, మరో మంత్రి జేసీ మధులు గవర్నర్ నివాసానికి చేరుకున్నారు. కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ సోమవారం ఉదయం సిఎం బిఎస్ యెడియూరప్పను కలిశారు.తనకు ఏ బాధ్యత అప్పగించినా నా సామర్థానికి తగినట్లు పనిచేస్తానని బీసీ పాటిల్ చెప్పారు.