తక్కిన విడతలకు ఒకేరేజు పోలింగ్ ‌కోరిన టీఎంసీ, ఆ ప్రసక్తే లేదన్న బీజేపీ..!

ABN , First Publish Date - 2021-04-17T00:40:28+05:30 IST

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాటించాల్సిన కోవిడ్ నిబంధనలపై..

తక్కిన విడతలకు ఒకేరేజు పోలింగ్ ‌కోరిన టీఎంసీ, ఆ ప్రసక్తే లేదన్న బీజేపీ..!

కోల్‌కతా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాటించాల్సిన కోవిడ్ నిబంధనలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం ముగిసింది.   మిగిలిన విడతల పోలింగ్‌ను ఏకం చేసి అన్నింటికీ ఒకేసారి ఎన్నికల జరపాలనే తమ వాదనను సమావేశంలో పునరుద్ఘాటించినట్టు సమావేశానంతరం మీడియాకు టీఎంసీ తెలిపింది. అయితే, తమ ఎజెండాలో ఇలాంటిదేమీ (ఒకేసారి పోలింగ్) బీజేపీ వెల్లడించింది.


టీఎంసీ నేత పార్ధ ఛటర్జీ మీడియాతో మాట్లాడుతూ, సీఈఓ తమ వాదనను ఓపికగా విన్నారని, కోవిడ్ నిరోధానికి తగిన నిర్ణయం తీసుకుంటారని తాము ఆశిస్తున్నామని చెప్పారు. ప్రచారానికి అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలన్నారు. అన్ని విడతలకు ఒకే రోజు పోలింగ్ నిర్వహించడం ఇందుకు ఎలాంటి ఆటకం కాదని ఆయన చెప్పారు. మరోవైపు, బీజేపీ అభ్యర్థి స్వపన్ దాస్ గుప్తా మాట్లాడుతూ, తక్కిన విడతలను క్లబ్బింగ్ చేసి ఒకేరోజు నిర్వహించాలనే అంశం అసలు ఎజెండాలోనే లేదని చెప్పారు. ''ఎనిమిది దశల పోలింగ్ ఎప్పుడూ ఉంది. సురక్షిత విధానాలతో ప్రజాస్వామ్య ప్రక్రియను పటిష్టం చేయాలని ఎన్నికల కమిషన్‌కు మేము సూచించాం. రాజకీయ పార్టీలు ఇతమిత్ధంగా ఏం చేయాలనేది ఈసీనే చెప్పాల్సి ఉంటుంది. ప్రోటోకాల్స్‌ను తూచ తప్పకుండా పాటిస్తామని ఈసీకి భరోసా ఇచ్చాం'' అని ఆయన తెలిపారు.

Updated Date - 2021-04-17T00:40:28+05:30 IST