షాకింగ్ ఘటన.. అంత్యక్రియలు చేసిన 3 నెలల తర్వాత సమాధిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీసి..

ABN , First Publish Date - 2022-09-23T22:27:51+05:30 IST

ఆ వ్యక్తి మే నెలలో బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.. తీవ్ర గాయాల పాలైన అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు..

షాకింగ్ ఘటన.. అంత్యక్రియలు చేసిన 3 నెలల తర్వాత సమాధిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీసి..

ఆ వ్యక్తి మే నెలలో బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.. తీవ్ర గాయాల పాలైన అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకున్నారు.. ఆస్పత్రిలో చాలా కాలం చికిత్స అందుకున్న ఆ వ్యక్తిని కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితి కారణంగా ఇంటికి తీసుకెళ్లిపోయారు.. నెల రోజుల తర్వాత అతను మరణించాడు.. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించకుండా అంత్యక్రియలు పూర్తి చేసేశారు.. చాలా ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని మూడు నెలల తర్వాత బయటకు తీసి పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 


ఇది కూడా చదవండి..

ఎన్నాళ్లీ ఉద్యోగాలంటూ ఈ బీటెక్ కుర్రాడి మదిలో కొత్త ఆలోచన.. రూ.లక్షతో సొంతంగా వ్యాపారం పెడితే.. ఇప్పుడు ఏకంగా..


ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని సెమ్రాదిహ్ గ్రామానికి చెందిన భగవత్ ప్రసాద్ అనే వ్యక్తి మే 25న బైక్‌పై జొంధరా ​​వైపు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ప్రసాద్‌ను చుట్టుపక్కల వారు బలోదాబజార్ జిల్లాలోని లావన్ వద్ద ఉన్న ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే హాస్పిటల్ బిల్ కట్టుకునే స్థోమత లేక కొద్ది రోజుల తర్వాత భగవత ప్రసాద్‌ను కుటుంబ సబ్యులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇంట్లోనే జూన్ 2వ తేదీన ప్రసాద్ మరణించాడు. అయితే ప్రసాద్ మరణించినట్టు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేశారు. 


మే నెలలో రిజిస్టర్ చేసిన కేసు విషయమై భగవత్ ప్రసాద్ స్టే‌ట్‌మెంట్ తీసుకునేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. భగవత్ ప్రసాద్ చనిపోయి మూడు నెలలు అయినట్టు తెలుసుకుని షాకయ్యారు. తమకు చెప్పుకుండా అంత్యక్రియలు నిర్వహించినందుకు కుటుంబ సభ్యులను మందలించారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో భగవత్ ప్రసాద్ మృతదేహాన్ని తవ్వి తీసి పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.  

Updated Date - 2022-09-23T22:27:51+05:30 IST