27 ఏళ్ల తర్వాత...

ABN , First Publish Date - 2020-02-19T09:58:09+05:30 IST

ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 27 ఏళ్ల తర్వాత ఆసియా రెజ్లింగ్‌లో గ్రీకో రోమన్‌ విభాగంలో భారత్‌కు పసిడి పతకం లభించింది. మంగళవారం చాంపియన్‌షి్‌ప ప్రారంభంకాగా..

27 ఏళ్ల తర్వాత...

  • గ్రీకో రోమన్‌లో భారత్‌కు స్వర్ణం
  • ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప

న్యూఢిల్లీ: ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 27 ఏళ్ల తర్వాత ఆసియా రెజ్లింగ్‌లో గ్రీకో రోమన్‌ విభాగంలో భారత్‌కు పసిడి పతకం లభించింది. మంగళవారం చాంపియన్‌షి్‌ప ప్రారంభంకాగా..తొలిరోజు సునీల్‌ కుమార్‌ అదరగొట్టాడు. పురుషుల 87 కిలోల విభాగం ఫైనల్లో సునీల్‌ 5-0తో అజత్‌ సలిదినోవ్‌ (కిర్గిస్థాన్‌)ను చిత్తు చేసి స్వర్ణ పతకం అందించాడు. అంతకుముందు సెమీ్‌సలో సునీల్‌ కుమార్‌ అద్భుతంగా రాణించాడు. అజమత్‌ కుస్తుబయేవ్‌ (కజకిస్థాన్‌)తో పోరులో 1-8తో వెనుకంజలో ఉన్న దశలో సునీల్‌ అమోఘంగా పోరాడాడు. వరుసగా 11 పాయింట్లు చేజిక్కించుకుని 12-8తో బౌట్‌ విజేతగా నిలిచాడు. 2019 చాంపియన్‌షి్‌పలోనూ టైటిల్‌ ఫైట్‌కు చేరిన సునీల్‌ రజతంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 55 కిలోల గ్రీకో రోమన్‌లో మరో భారత రెజ్లర్‌ అర్జున్‌ హలకూరి కాంస్య పతకం గెలుపొందాడు. నసెర్‌పౌర్‌ (ఇరాన్‌)తో సెమీ్‌సలో 7-1 ఆధిక్యంలో నిలిచిన అర్జున్‌..ఆపై క్రమంగా ‘పట్టు’కోల్పోయి 7-8తో ఓడిపోయాడు. 

Updated Date - 2020-02-19T09:58:09+05:30 IST