19ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం.. ఒక్కసారిగా రూ.8కోట్లు దక్కడంతో..

ABN , First Publish Date - 2022-01-14T02:33:16+05:30 IST

ఆశలు వదలుకున్న సందర్భాల్లో ఒక్కోసారి అనూహ్యం ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడో 19ఏళ్ల క్రితం చోరీ అయిన బంగారుపై ఆ కుటుంబం ఆశలు వదులుకుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా అదృష్టం వారిని వెతుక్కుంటూ..

19ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం.. ఒక్కసారిగా రూ.8కోట్లు దక్కడంతో..
ప్రతీకాత్మక చిత్రం

ఆశలు వదులుకున్న సందర్భాల్లో ఒక్కోసారి అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడో 19ఏళ్ల క్రితం చోరీ అయిన బంగారుపై ఆ కుటుంబం ఆశలు వదులుకుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా అదృష్టం వారిని వెతుక్కుంటూ వచ్చింది. అనూహ్యంగా వారి బంగారు వారికి దక్కింది. ఇప్పుడు దాని విలువ రూ.8కోట్లు ఉండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


ముంబైలోని ప్రముఖ చరగ్ దిన్ వ్యవస్థాపకుడు అర్జున్ దాస్వానీ కుటుంబంపై 19 ఏళ్ల క్రితం ఓ ముఠా కత్తులతో దాడి చేసింది. దంపతులిద్దరినీ తాళ్లతో కట్టేసి రూ.13 లక్షల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో 1998లో ముగ్గురిని అరెస్టు చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 1999లో విచారణలో ఆ ముగ్గురినీ నిర్దోషులుగా తేల్చారు. మరో ముగ్గురు మాత్రం ఇప్పటికీ పరారీలో ఉన్నారు.

అక్కా చెల్లెళ్లు చేసిన నిర్వాకం.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని ఊరి బయటకు రమ్మని.. మరుసటి రోజు చూసేసరికి..


ఇదిలావుండగా బంగారు మాత్రం ఇప్పటికీ పోలీసుల స్వాధీనంలోనే ఉంది. అయితే తాజాగా కోర్టు ఆదేశాలతో ఆ నగలను బాధితులకు అందించారు. నిబంధనలను అనుసరించి, సొత్తును బాధితులకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. అర్జన్ దాస్వానీ కొడుకు రాజు దాస్వాని.. ఆస్తికి సంబంధించిన బిల్లులను సమర్పించి, బంగారును తీసుకున్నాడు. ప్రస్తుతం దాని విలువ రూ.8కోట్లు ఉండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఫిట్స్ కారణంగా చనిపోయాడంటూ భర్త అంత్యక్రియలు.. రెండు రోజుల తర్వాత కొడుకు బయటపెట్టిన నిజం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..

Updated Date - 2022-01-14T02:33:16+05:30 IST