ఆ కుర్రాళ్ళిద్దరికీ పెళ్లయిన మొదటి నుంచి భార్యలపై డౌట్.. యాప్ సాయంతో నిఘా.. 15వ రోజు రాత్రి 2 గంటల టైంలో..

ABN , First Publish Date - 2021-10-28T16:48:47+05:30 IST

ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న..

ఆ కుర్రాళ్ళిద్దరికీ పెళ్లయిన మొదటి నుంచి భార్యలపై డౌట్.. యాప్ సాయంతో నిఘా.. 15వ రోజు రాత్రి 2 గంటల టైంలో..

ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న వింతైన మోసాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రాజస్థాన్‌లోని నాగౌర్‌లో పెళ్లి మాటున ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పెళ్లయిన 15 రోజులకు ఇద్దరు పెళ్లికుమార్తెలు నగలు, నగదు తీసుకుని ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వారి కోసం తీవ్రంగా గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆగస్టు 18న ఒక అగ్రిమెంట్ ప్రకారం వీరి వివాహం జరిగింది. నాగౌర్ జిల్లాలోని జావ్లా గ్రామానికి చెందిన రామ్ దయాళ్ పిండిమర నడుపుతుంటాడు. అదే గ్రామనికి చెందిన దీపేష్ పోటీ పరీక్షలకు సిద్శమవుతున్నాడు. వీరిద్దరికీ దీపాలీ, రమా అనే యువతులతో వివాహం జరిగింది. వీరిద్దరూ నాగపూర్‌కు చెందిన వారు. పెళ్లయిన తరువాత నుంచి వీరిద్దరిపై వారి భర్తలకు అనుమానం కలిగింది. దీంతో వీరు తమ భార్యలకు చెరో ఫోను కొనిచ్చారు. దానిలో క్లోనింగ్ యాప్ డౌన్‌లోడ్ చేశారు. ఈ యాప్ ద్వారా కొత్త పెళ్లికుమార్తెల కాల్ డీటైల్స్‌తో పాటు మెసేజ్‌లను తెలుసుకోవాలని వారి భర్తలు భావించారు. ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ ఇద్దరు యువతులూ తమ భర్తల కన్నుగప్పి రాత్రి రెండు గంటల సమయంలో ఇంటి నుంచి ఉడాయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే నాగోర్ జిల్లా జావ్లా గ్రామానికి చెందిన దీపేష్, అతని బావ రామ్‌దయాళ్‌లకు... లాయర్ మొహమ్మద్, అతని భార్య ఆలియాలు పెళ్లి సంబంధం కుదిర్చారు. రెండు రోజుల తరువాత వారికి పెళ్లి కుమార్తెలను చూపించారు. ఇందుకోసం వారు పెళ్లి కుమారుల నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆగస్టు 18న వీరి వివాహం జరిగింది. 


15 రోజల అనంతరం రామ్ దయాళ్ భార్య రమ.. తన సోదరి దీపాలీని చూసేందుకు భర్తతో పాటు దీపేష్ ఇంటికి వచ్చింది. ఆ అక్కాచెళ్లెళ్లు తమ భర్తలకు ఆరోజు రాత్రి మత్తుమందు కలిపిన పాలు ఇచ్చారు. దీంతో రామ్ దయాళ్, దీపేష్ ఆ పాలు తాగిన వెంటనే స్పృహ కోల్పోయారు. వెంటనే ఆ అక్కా చెళ్లెళ్లు, ఇంటిలోని నగదు, నగలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. మర్నాడు నిద్ర నుంచి లేచిన రామ్ దయాల్, దీపేష్‌లకు తన భార్యలు ఇంటిలో కనిపించలేదు. దీంతో వారు తాము మోసపోయామని గ్రహించారు. ఈ పెళ్లి సంబంధం కుదిర్చిన జంట కూడా ఆ ప్రాంతం నుంచి మాయమయ్యింది. దీంతో రామ్‌దయాళ్, దీపేష్‌లిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

Updated Date - 2021-10-28T16:48:47+05:30 IST