న్యూజిల్యాండ్‌లో 102 రోజుల తరువాత నమోదైన కరోనా కేసు

ABN , First Publish Date - 2020-08-11T22:15:02+05:30 IST

న్యూజిల్యాండ్‌లో 102 రోజుల తరువాత మళ్లీ కొత్తగా ఒక కరోనా కేసు నమోదైంది.

న్యూజిల్యాండ్‌లో 102 రోజుల తరువాత నమోదైన కరోనా కేసు

వెల్లింగ్టన్: న్యూజిల్యాండ్‌లో 102 రోజుల తరువాత మళ్లీ కొత్తగా ఒక కరోనా కేసు నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం సాధించని ఘనతను న్యూజిల్యాండ్ సాధించిన విషయం తెలిసిందే. ఎందుకంటే గత వంద రోజుల నుంచి న్యూజిల్యాండ్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాకుండా అక్కడి ప్రభుత్వం చాకచక్యంగా మహమ్మారిని అదుపులో ఉంచగలిగింది. ఇక తాజాగా నమోదైన కేసు కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వ్యక్తిదని తేలింది. ఇరవైల వయసులో ఉన్న వ్యక్తి జూలై 30న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నుంచి న్యూజిల్యాండ్‌కు వచ్చాడని.. అతడకి తాజాగా కరోనా పాజిటివ్ అని తేలినట్టు అధికారులు తెలిపారు. న్యూజిల్యాండ్‌కు వచ్చిన నాటి నుంచి అతడు ఐసోలేషన్‌లోనే ఉన్నాడని.. మూడో రోజు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చిందన్నారు. ఇక పన్నెండో రోజు మళ్లీ కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ అనే తేలినట్టు చెప్పారు. ప్రస్తుతం అతడిని క్వారంటైన్‌కు పంపినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కేసుతో కలిపి న్యూజిల్యాండ్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,220కు చేరింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 22 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.

Updated Date - 2020-08-11T22:15:02+05:30 IST