Abn logo
Apr 13 2021 @ 05:30AM

అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత

మిన్నియాపొలిస్‌, ఏప్రిల్‌ 12: అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ హత్య జరిగి ఏడాది గడవక ముందే.. పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న డౌంట్‌ రైట్‌ (20) అనే నల్లజాతి యువకుడ్ని అతడి కారులోనే పోలీసులు కాల్చిచంపారు. దీంతో స్థానిక బ్రూక్లిన్‌ సెంటర్‌లో ఆదివారం రాత్రి నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్‌ను చుట్టు ముట్టి నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement