e-Visa: భారత ఎంబసీ ఎదుట అఫ్ఘాన్‌ విద్యార్థుల ఆందోళన!

ABN , First Publish Date - 2022-05-06T12:58:00+05:30 IST

భారత్‌లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న అఫ్ఘానిస్థాన్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు ఎలక్ట్రానిక్‌ వీసాల కోసం భారత ఎంబసీ ఎదుట ఆందోళనకు దిగారు.

e-Visa: భారత ఎంబసీ ఎదుట అఫ్ఘాన్‌ విద్యార్థుల ఆందోళన!

కాబూల్‌, మే 5: భారత్‌లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న అఫ్ఘానిస్థాన్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు ఎలక్ట్రానిక్‌ వీసాల కోసం భారత ఎంబసీ ఎదుట ఆందోళనకు దిగారు. గత ఏడాది అఫ్ఘాన్‌లో ఏర్పడి న తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్‌ గుర్తించ లేదు. అప్పటికే భారత్‌లో చదువుతూ తమ దేశంలో చిక్కుకున్న 2,500 మంది అఫ్ఘాన్‌ విద్యార్థులకు భారత్‌  వీసాలు రద్దు చేసింది. వారికి ఈ-వీసాలు మంజూరు చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు చేసుకుని 7 నెలలు గడుస్తున్నా భారత్‌ స్పందించడం లేదని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more